సోనియా బూట్లు నాకావు.. మీ నాన్న జేబులుకొట్టాడా? నీ టైం ఫినిష్.. చంద్రబాబుపై కొడాలి నాని ధ్వజం

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీ నేత దేవినేని అవినాష్ టీడీపీని వీడిన తర్వాత ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తెలుగుదేశం పార్టీ నేతలు, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జోరందుకున్నది. శనివారం టీడీపీ నేతలు దేవినేని ఉమ ఇతర నేతలు ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర విమర్శలు చేయడంపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ..

తిరుపతి గుడికి వెళ్తే సంతకం..

తిరుపతి గుడికి వెళ్తే సంతకం..

తిరుపతి గుడికి వెళ్తే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సంతకం చేసి వెళ్లుందని చంద్రబాబు అంటాడు. ఆమె ఇటలీకి చెందిన విదేశీ వనిత.. వైఎస్ జగన్ ఆంధ్రా పౌరుడు. సోనియాగాంధీ సంతకం పెడితే పెట్టి వెళ్లవచ్చు. సోనియా అంటీ నీకు భయమేమో.. సోనియా, చిదంబరం బూట్లూ నాకావు. సోనియా అంటే వైఎస్ జగన్‌కు భయం లేదు. కాబట్టి తిరుపతి సంతకం పెట్టి వెళ్తాడా చంద్రబాబు అడిగే హక్కు లేదు. చంద్రబాబు అమ్మ మొగుడు తిరుపతిని కట్టించాడా? అని కొడాలి నాని ధ్వజమెత్తాడు.

వైఎస్ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే..

వైఎస్ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే..

వైఎస్ రాజారెడ్డి గురించి తప్పుడుగా మాట్లాడవద్దని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వైఎస్ రాజారెడ్డి దోపిడిలు చేశాడని ఆరోపణలు చేస్తున్నావు.. నీ అయ్య ఖర్జూర నాయుడు తిరుపతి బస్టాండులో జేబులు కొట్టాడా? రాజారెడ్డి, వైస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ కుటుంబ సభ్యులు గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే.. నీ తండ్రి ఖర్జురా నాయుడు బస్టాండులో పాకెట్లు కొట్టిన వద్ద నుంచి నీ తాత, ఆడి తాత ఏం చేశాడనే విషయం బయటపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అని హెచ్చరించారు.

పప్పు వల్లే పార్టీలో సంక్షోభం

పప్పు వల్లే పార్టీలో సంక్షోభం


టీడీపీలో సంక్షోభం నీ కొడుకు పప్పు వల్ల వచ్చింది. రోడ్డు రోలర్‌గా తొక్కేస్తాడని అందరూ భయపడి పోతున్నారు. ఎటో ఓ వైపు దూకేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో నీ పార్టీని కాపాడుకోలేని స్థితిలో ఉన్నారు. నీ దరిద్రపు ముఖం చూడలేక మీ పార్టీ నేతలు కష్టపడుతున్నారు. ఇసుక దీక్ష పేరుతో దీక్ష చేసి.. తండోపతండాలుగా రావాలని ప్రజలను కోరితే.. ఎవరు రాని పరిస్థితి కనిపించింది. నీ పార్టీలో 23 మంది ఉంటే.. 9 మందికి మించి రాలేదు. అలాంటి దీక్ష సూపర్ సక్సెస్ అని చెప్పుకొంటున్నాడు అని కొడాలి నాని హెచ్చరించారు.

ఇసుక దీక్షపై సెటైర్లు

ఇసుక దీక్షపై సెటైర్లు

ఇసుక దీక్ష సందర్భంగా ఉదయం టిఫిన్ చేసి.. మధ్యాహ్నం ప్రూట్స్ తిని, రాత్రి భోజనం చేసే వ్యక్తి చంద్రబాబు. ఎవరైనా ఇసుక బస్తాను మెడలో వేసుకొని దీక్ష చేస్తారా అని కొడాలి నాని ప్రశ్నించాడు. ఇసుక బస్తా దండను ఎందుకు వేశావని కార్యకర్తను ప్రశ్నిస్తే.. తన ప్రభుత్వ హయాంలో ఇసుకను బుక్కేసుకొన్నాడని సింబాలిక్‌గా చెప్పడానికి మేము దండ వేశామని.. వాళ్లు మాకు చెబుతున్నారు అని ఎద్దేవా చేశారు.
నీ టైం ఫినిష్

నీ టైం ఫినిష్

చంద్రబాబు నాయుడు నీ టైం ముగిసింది. నీ ముఖ్యమంత్రివి కాదు గదా.. ప్రతిపక్ష నాయకుడివి కాలేవు. ఇక నీ డ్రామాలు ఆపు. నీ పక్కన ఉండే కుక్కలను పార్టీ నేతలపై తోస్తున్నావు. నీవు ఇందిరాగాంధీకి, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవ వచ్చు. నీవు పార్టీలు మార్చవచ్చు. కానీ నీవు బీ ఫారాలు ఇచ్చిన వ్యక్తులు నీ కాళ్ల వద్ద ఉండాలా? అంటూ కోడాలి నాని భగ్గుమన్నారు. కాంగ్రెస్ పార్టీని నీవు ఎందుకు మారావో ముందు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

ఇందిరా, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు

ఇందిరా, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు

నీలాంటి ఫ్లాట్‌ఫాం వాడికి ఇందిరాగాంధీ రెండు సార్లు బీఫారాలు ఇచ్చి మంత్రిని చేస్తే వెన్నుపోటు పొడిచావు. ఎన్టీఆర్ బీఫారం ఇస్తే ఆయనకు వెన్నుపోటు పొడిచావు. ఈ రెండింటికి నీవు ముందు సమాధానం చెప్పాలి. మైకుల వద్ద మొరిగే కుక్కలను అడగాలి.. ఆయన పార్టీ ఎందుకు మారాడో చెప్పాలి. ఇంగ్లీష్ భాషలో మీ పిల్లలు చదువుకోవచ్చు.. పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవద్దా? అని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+