రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - నెక్స్ట్ 24 గంటల్లో నిధుల జమ..!!
ఏపీ ప్రభుత్వం రైతులకు బిగ్ అప్డేట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల పథకాలకు ప్రాధాన్యత ఇస్తోంది. అన్నదాత సుఖీభవ నిధులను ఇప్పటి వరకు రెండు విడతలు చెల్లించింది. పీఎం కిసాన్ తో కలిపి ఈ నిధులను విడుదల చేసింది. కాగా, ఇప్పుడు రైతులకు చేస్తున్న చెల్లింపు గురించి మంత్రి మనోహర్ కీలక ప్రకటన చేసారు. ఎవరూ ఊహించని విధంగా 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నట్లు వెల్లడించారు.
రబీ ధాన్యం సేకరణపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ధాన్య సేకరణ ప్రారంభించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ విజయవంతం గా పూర్తయిందని, కొన్నిచోట్ల సాగు ఆలస్యమైనా రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరణ పూర్తయిందని చెప్పారు. అదే విధంగా రబీ సీజన్ ధాన్యం సేకరణ చేపడుతున్నామని, ఇప్పటికే సేకరించే ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. ఎలాంటి అక్రమాలు, పొరపాట్లకు తావు లేకుండా రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇక ధాన్యం కొన్న 24 గంటల్లోనే నిధులు రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసేలా చర్యలు చేపట్టినట్లు మనోహర్ స్పష్టం చేశారు. ఈ ఏడాది 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, రూ.11,300 కోట్లను 24 గంటల్లోనే రైతులకు అందించినట్లు తెలిపారు.

రబీ ధాన్యం సేకరణ.. 24 గంటల్లో నిధుల జమ
అదే విధంగా రూ.7,300 కోట్లను 8 గంటల్లోనే జమ చేశామని చెప్పారు. అలాగే రబీలో 19.84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, ఇదొక రికార్డుగా వివరించారు. 2.01 లక్షల మంది రైతులకు రూ.4,575 కోట్లను 48 గంటల్లో వేశామని వెల్లడించారు. గతంలో జరిగిన పొరపాట్లను గుర్తించి ఈ సారి అవి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కంటే కూటమి హయంలో ధాన్యం సేకరణ ఎక్కువ జరిగిందన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో రైతులు ధాన్యం అమ్మిన తర్వాత నెల లేదా రెండు నెలలకు నిధులు జమ చేసే వారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఖరీఫ్‌కు సంబంధించి 2022-23లో 35.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగ్గా.. రైతులకు రూ.7,222 కోట్లు అందించారు. ఇక 2023-24లో 29.97 లక్షల మెట్రిక్ టన్నులు, 2024-25లో 35.95 లక్షల మెట్రిక్ టన్నులు, 2025-26 లో 48.70 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications