శేఖర్‌రె్డ్డితో సంబంధాలపై పవన్ యూ టర్న్, ఆ వ్యాఖ్యలు బాధించాయి: లోకేష్ సంచలనం

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంటే నాలుగేళ్ళుగా పవన్ కళ్యాణ్ ఎందుకు తమ దృష్టికి తీసుకురాలేదని ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారాలోకేష్ ప్రశ్నించారు. ఎందుకు రాత్రికి రాత్రే పవన్ కళ్యాణ్ యూ టర్న్ తీసుకొన్నారని ఆయన ప్రశ్నించారు. టిటిడి మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డితో తనకు సంబంధాలున్నాయని ఆ తర్వాత ఎందుకు మాట మార్చారని పవన్‌కళ్యాణ్‌ను లోకేష్ ప్రశ్నించారు.

గుంటూరులో ఇటీవల జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్ర మంత్రి లోకేష్‌పై ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై విమర్శలు ఎక్కు పెట్టారు.ఈ విమర్శలపై లోకేష్ తొలిసారిగా స్పందించారు.

మంగళవారం నాడు ఏపీ టిడిఎల్పీ లో లోకేష్ మీడియాతో చిట్ చాట్ చేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదంటూనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సూటిగా సమాధానమిచ్చారు.

పవన్ కళ్యాణ్ నిరాధార ఆరోపణలు

పవన్ కళ్యాణ్ నిరాధార ఆరోపణలు

తనపై, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిరాధార ఆరోపణలు చేశారని ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారాలోకేష్ చెప్పారు. పవన్ కళ్యాణ్ దుమ్మెత్తిపోస్తే ఆ దుమ్మును తాను దులుపుకోవాలా అంటూ లోకేష్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని లోకేష్ చెప్పారు.

శేఖర్‌రెడ్డితో సంబంధాలు అంటగట్టారు

శేఖర్‌రెడ్డితో సంబంధాలు అంటగట్టారు

టిటిడి మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డితో తనకు సంబంధాలను అంటగట్టారని ఏపీ రాష్ట్ర మంత్రి లోకేష్ చెప్పారు.. శేఖర్‌రెడ్డితో ఆరోపణలు చేసిన తర్వాత ఆధారాలుంటే రుజువు చేయాలని డిమాండ్ చేయడంతో పవన్ కళ్యాణ్ మాట మార్చారని లోకేష్ చెప్పారు. ఈ వ్యాఖ్యల వెనుక మర్మమేమిటో తెలియదని లోకేష్ చెప్పారు.ఏపీ ప్లానింగ్ కమిషన్ సభ్యుడు పెద్ది రామారావును చూసి శేఖర్‌రెడ్డిగా భ్రమ పడ్డారని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఓ ఫోటోలో తనతో పెద్దిరామారావు ఉన్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు

ఆ వ్యాఖ్యలు బాధను కల్గించాయి

ఆ వ్యాఖ్యలు బాధను కల్గించాయి

దివంగత ఏపీ సీఎం ఎన్టీఆర్‌కు తాను చెడ్డపేరును తీసుకొస్తున్నానని జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు తనకు భాదను కల్గించాయిన ఏపీ రాష్ట్ర మంత్రి లోకేష్ చెప్పారు. తాను పుట్టే సమయానికే ఏపీ రాష్ట్రానికి ఎన్టీఆర్ సీఎంగా ఉన్నాడని లోకేష్ గుర్తు చేశారు. తాతకు ఏనాడూ కూడ చెడ్డపేరు తీసుకురానని లోకేష్ చెప్పారు.

పవన్ స్థాయి తగ్గించుకొన్నారు.

పవన్ స్థాయి తగ్గించుకొన్నారు.


టిడిపిపై, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై, తనపై నిరాధర ఆరోపణలతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తన స్థాయిని తగ్గించుకొన్నారని ఏపీ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.ఎప్పటికప్పుడు తమ ఆస్తులను ప్రకటిస్తున్న విషయాన్ని కూడ లోకేష్ గుర్తు చేశారు. తాను ప్రకటించిన ఆస్తుల కంటే చిల్లిగవ్వ ఎక్కువ ఉన్నా వాటిని రాసిస్తానని లోకేష్ చెప్పారు.రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్నా చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ రేటింగ్ ఇవ్వడం అవసరం లేదని లోకేష్ అభిప్రాయపడ్డారు.

పరువు నష్టం దావాపై పార్టీ నిర్ణయం

పరువు నష్టం దావాపై పార్టీ నిర్ణయం

నిరాధార ఆరోపణలు చేసిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై పరువు నష్టం దావా వేసే విషయాన్ని పార్టీ నిర్ణయం తీసుకొంటుందని ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ చెప్పారు. ఎవరేమిటో ఏపీ ప్రజలకు తెలుసునని లోకేష్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+