హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నారాయణ కొడుకు మృతి: కేటీఆర్, లోకేష్ సహా నేతల దిగ్భ్రాంతి, పరామర్శించిన పవన్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మరణం పట్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, రాజకీయ ప్రముఖులు తీవ్ర గ్భ్రాంతి వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మరణం పట్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, రాజకీయ ప్రముఖులు తీవ్ర గ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ మంత్రులు లోకేష్, చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, తెలంగాణ మంత్రి కేటీఆర్ తదితరులు నారాయణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పవన్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.

అందరూ నా కొడుకేమో అనుకుని ఫోన్లు, బాధ కలిగించింది: నారాయణ అందరూ నా కొడుకేమో అనుకుని ఫోన్లు, బాధ కలిగించింది: నారాయణ

<strong>మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న బెంజ్ కారు: ఏపీ మంత్రి నారాయణ కుమారుడు మృతి</strong>మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న బెంజ్ కారు: ఏపీ మంత్రి నారాయణ కుమారుడు మృతి

లోకేష్ దిగ్భ్రాంతి: ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని..

లోకేష్ దిగ్భ్రాంతి: ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని..

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేశ్‌ తన పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ ప్రమాదం పట్ల లోకేశ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌కు హోంమంత్రి చినరాజప్ప, సోమిరెడ్డి

హైదరాబాద్‌కు హోంమంత్రి చినరాజప్ప, సోమిరెడ్డి

ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తన తూర్పుగోదావరి జిల్లా పర్యటనను రద్దు చేసుకుని హైదరాబాద్‌కు చేరుకుని కుటుంబసభ్యులను పరామర్శించారు. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్‌తో కలిసి హైదరాబాద్‌కు బయలుదేరారు.

ఆ బాధ నాకు తెలుసు: హరికృష్ణ

ఆ బాధ నాకు తెలుసు: హరికృష్ణ

సినీనటుడు, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ.. నారాయణ కుమారుడి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కొడుకు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని... నారాయణ కుటుంబసభ్యులకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలని అన్నారు.కాగా, హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్‌ 2014, డిసెంబర్‌ 6న నల్గొండ జిల్లా ఆకుపాముల వద్ద హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

ఏపీ మంత్రుల దిగ్భ్రాంతి

ఏపీ మంత్రుల దిగ్భ్రాంతి

కేంద్రమంత్రి సుజనాచౌదరితో పాటు రాష్ట్ర మంత్రులు కళా వెంకట్రావు, పరిటాల సునీత, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమమహేశ్వరరావు, అమర్‌నాథ్‌రెడ్డి, కామినేని శ్రీనివాస్‌, గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, శిద్దా రాఘవరావు, కొల్లు రవీంద్ర తదితరులు నిశీత్‌ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

లండన్ నుంచి మంత్రి నారాయణ

లండన్ నుంచి మంత్రి నారాయణ

కొడుకు మరణ వార్త విని మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. హుటాహుటిన బయల్దేరిన ఆయన బుధవారం రాత్రి లండన్‌ నుంచి హైదరాబాద్‌ చేరుకునే అవకాశం ఉంది.

కేటీఆర్ దిగ్భ్రాంతి

నిశిత్ మృతి పట్ల దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. నారాయణ కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఇప్పటికే మంత్రి హరీశ్ రావు అపోలో ఆస్పత్రికి చేరుకుని నారాయణ కుటుంబసభ్యులను పరామర్శించారు. అక్కడేవుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

పరామర్శించిన పవన్ కళ్యాణ్

పరామర్శించిన పవన్ కళ్యాణ్

ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మృతి పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అపోలో హాస్పిటల్ వద్ద మంత్రి నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో పవన్ కళ్యాణ్ తోపాటు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర నేతలున్నారు.
కాగా, అపోలో మెడికల్ కాలేజీలోనే నిశిత్, రవివర్మ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు ఉస్మానియా వైద్యులు.

English summary
Andhra Pradesh and Telangana minister and leaders Expressed their condolence to Andhra Pradesh minister Narayana's son Nishit's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X