వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో భారీగా అటవీ భూముల కబ్జా ! మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరిక...

|
Google Oneindia TeluguNews

ఏపీలో అటవీభూముల కబ్జాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.అటవీభూముల సంరక్షణపై ప్రత్యేక్ష దృష్టి సారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వివాదాస్పదంగా ఉన్న 10వేల ఎకరాలపై ఇప్పటికే విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. అటవీ, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో జాయింట్ సర్వే కొనసాగుతోందని, సమగ్ర భూసర్వే ద్వారా భూముల యాజమాన్య హక్కుల నిర్ధారణ చేస్తామని ఆయన వెల్లడించారు. కబ్జాకు గురైన అటవీభూములు తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
అటవీభూములపై కన్నేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న జగనన్న భూహక్కు-భూరక్ష సర్వే ద్వారా ప్రతి ఎకరంకు నిర్ధిష్టమైన సమాచారంతో యాజమాన్య హక్కులను గుర్తించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని అటవీప్రాంతాలకు సరిహద్దుగా ఉన్న గ్రామాల్లో అటవీభూములను కబ్జా చేసి, తప్పుడు పట్టాలు సృష్టించి భూములను తమ ఆధీనంలో ఉంచుకున్నారనే ఫిర్యాదులపై ఇప్పటికే ప్రభుత్వం దర్యాప్తు జరుపుతోందన్నారు. దాదాపు పదివేల ఎకరాలకు సంబంధించి ఈ వివాదాలు ఉన్నాయని, వాటిపై అటవీ, రెవెన్యూ అధికారుల సంయుక్త సర్వే జరుగుతోందన్నారు.

ap minister peddireddy warns action against forest lands enchrochments after lands survey

దొంగపట్టాలతో ఎవరైనా అటవీభూములను తమ ఆధీనంలో పెట్టుకుని వాటిల్లో పంటలు పండించుకుంటున్నా వదిలిపెట్టేది లేదని, జాయింట్ సర్వేలో పూర్తి వివరాలు వెలుగుచూస్తాయని పెద్దిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర సర్వేలో సైతం శాటిలైట్ ఇమేజింగ్, అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరైనా సరే సులువుగా అర్థం చేసుకునే విధంగా భూముల వివరాలను నమోదు చేస్తున్నారని తెలిపారు.

ఈ నేపథ్యంలో కబ్జాదారులను గుర్తించడం, ఆక్రమణకు గురైన భూములను తిరిగి అటవీశాఖకు బదలాయించడం జరుగుతుందని, ఇందులో ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సీఎం వైయస్ జగన్ రాష్ట్రంలో అటవుల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారన్నారు. అటవీశాఖ ఇచ్చిన ఆర్.ఓ.ఎఫ్.ఆర్ భూములు తప్ప, మిగిలిన అటవీ భూములు అక్రమంగా ఎవరి ఆదీనంలో ఉన్నా అవి తిరిగి స్వాధీనం చేసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

English summary
ap minister peddireddy ramachandra reddy warns action against forest lands enchroachments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X