వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుపై రోజా హాట్ కామెంట్స్ ! జగన్ నిర్ణయానికి ముందే..?

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార వైసీపీలో ఇన్ ఛార్జ్ ల మార్పు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. సర్వేల ఆధారంగా సీఎం జగన్ చేపడుతున్న ఈ మార్పులు చేర్పుల్లో పలువురు మంత్రులకు కూడా ఈసారి టికెట్లు దక్కే పరిస్ధితి కనిపించడం లేదు. అలాగే ఈసారి టికెట్లు ఇవ్వలేని ఎమ్మెల్యేలతో సీఎం జగన్ ఇవాళ భేటీ అయ్యారు. వారిని పిలిపించుకుని మాట్లాడి బుజ్జగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆర్కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుపై జరుగుతున్న చర్చపై పర్యాటక మంత్రి ఆర్కే రోజా స్పందించారు. ప్రజలకు మంచి చేస్తే ఎన్నికల్లో గెలుపు తప్పకుండా వస్తుందని రోజా వ్యాఖ్యానించారు. అలాగే ప్రజల మన్ననలు పొందితే సీట్లు వాతంతట అవే వస్తాయంటూ రోజా వెల్లడించారు. వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పులో భాగంగా రోజాకు కూడా ఈసారి నగరి సీటు కష్టమేనని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ap minister rk roja hot comments on ysrcp incharges change, says cm jagan decision after talks

మరోవైపు రాష్ట్రంలో చేపడుతున్న వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల విషయంలో సీఎం జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు ఆర్కే రోజా తెలిపారు. ఇన్ ఛార్జ్ లను మార్చే ముందు వారితో ఒకటికి రెండు సార్లు మాట్లాడిన తర్వాతే జగన్ సర్దుబాట్లు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. కానీ దీనిపై విపక్షాలు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని రోజా మండిపడ్డారు. విపక్ష టీడీపీ-జనసేనకు ఓ మ్యానిఫెస్టో లేదని, సీట్ల సర్దుబాటు కూడా లేదని, వీళ్లు తమ గురించి మాట్లాడుతున్నారని రోజా ఆక్షేపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+