కబడ్డీ ఆడుతూ కిందపడిన మంత్రి రోజా
చిత్తూరు జిల్లా నగరి డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడిన మంత్రి రోజా కిందపడ్డారు. దీంతో అధికారులంతా ఉలిక్కిపడ్డారు. నగరి డిగ్రీ కళాశాలలో జరగనన్న క్రీడా సంబరాలను మంత్రి రోజా ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో కలిసి కొన్ని క్రీడలను ఆడారు. కబడ్డీ, క్రికెట్, వాలీబాల్ ఆడి విద్యార్థులను ప్రోత్సహించారు.
సెటీలకలె గంగాధన నెల్లూరు, నగరి, పుంగనూరు, పలమనేరు, చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. కూతకు వెళ్లిన రోజాను అమ్మాయిల జట్టు గట్టిగా పట్టుకున్నారు. దీంతో ఆమె వెల్లకిలా పడిపోయారు. ఆమెపై విద్యార్థులు పడ్డారు. కంగారుపడాల్సిన పడాల్సిన అవసరం లేదని, తనకేం దెబ్బలు తగల్లేదని రోజా వెల్లడించారు.

డిసెంబర్ 21న ముఖ్యమంత్రి జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పోటీలను నిర్వహిస్తున్నామని రోజా తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు క్రీడాకారులందరికీ గొప్ప అవకాశమని మంత్రి అభిప్రాయపడ్డారు. యువతకు చదువుతో పాటుగా క్రీడలు కూడా అవసరమమని, దీనివల్ల శారీరకంగా, మానసికంగా రెండు విధాలా ఫిట్ గా ఉంటారన్నారు.
Tiger Roja pic.twitter.com/OnhVOMIYWn
— JuLaYi ᴬᴬ🪓 (@JuLaYiAADHF) November 28, 2022

ఆసక్తి ఉన్న క్రీడాకారులు గ్రామ సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఒక బృందాన్ని పంపిస్తారని, జిల్లా స్థాయిలో గెలిచినవారికి జోనల్ స్థాయి, రాష్ట్ర స్థాయిలో పోటీలు ఉంటాయని వెల్లడించారు. విజేతలకు డిసెంబర్ 21న అవార్డులు అందిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications