ప్రమాదం ఎలా జరిగింది.. అతివేగం వల్లే: మంత్రి నారాయణ తనయుడి మృతిపై ఆరా
జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లో బుధవారం ఉదయం మృతి చెందిన మంత్రి నారాయణ తనయుడు నిషిత్ నారాయణ మృతి చెందారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాదంపై ఆరా తీశారు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లో బుధవారం ఉదయం మృతి చెందిన మంత్రి నారాయణ తనయుడు నిషిత్ నారాయణ మృతి చెందారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాదంపై ఆరా తీశారు. ఎలా చనిపోయాడని అడిగి తెలుసుకున్నారు.

ప్రమాదంపై చంద్రబాబు ఆరా
బుధవారం వేకువజామున ప్రమాదం జరిగింది. విషయం తెలియగానే హైదరాబాదులోనే ఉన్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ హుటాహుటిన సంఘటన స్థలం చేరుకున్నారు. ఆయనతో పాటు ఇతరులు విషయాన్ని మంత్రులు నారాయణ, సీఎం చంద్రబాబుకు తెలియజేశారు.

ఎలా జరిగింది?
ఈ సందర్భంగా బోండా ఉమ తదితరుల నుంచి ప్రమాదానికి గల కారణాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో వివరాలను వారు తెలిపారు. హైదరాబాదులో భారీ వర్షం, మెట్రో పనులు, అతి వేగం కారణంగా మృతి చెందినట్లు చంద్రబాబుకు వివరించారని తెలుస్తోంది.

మంత్రి తనయుడు సహా ఇద్దరు మృతి
నిషిత్ నారాయణ(22), అతడి స్నేహితుడు రాజా రవివర్మ(23) హైదరాబాదు రోడ్డు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నిషిత్, రాజా రవివర్మ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు నుంచి పెద్దమ్మ గుడి వైపు బెంజ్ కారు(టిఎస్ 07ఎస్‌కే 7117)లో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ప్రమాదం
వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి మెట్రో పిల్లర్ నెం 9 బలంగా ఢీకొట్టింది. కారు ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నప్పటికి ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అపోలో ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచారు.












Click it and Unblock the Notifications