Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోకేష్ కాబోయే సీఎం-చంద్రబాబు ముందే మంత్రి భరత్..!

ఏపీలో మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంను చేయాలంటూ టీడీపీ నేతల నుంచి భారీ ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ అధిష్టానం వాటికి బ్రేక్ వేసింది. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలా వద్దా అన్న దానిపై కూటమిలో నిర్ణయం తీసుకుంటామని, ఆలోపు ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దంటూ నేతలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలు వచ్చాక ఏపీ మంత్రి టీజీ భరత్.. లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యానించారు.

ap minister tg bharat says nara Lokesh is future cm violates tdp s order infront of Chandrababu

చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సేఫ్ హ్యాండ్స్ లో ఉందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఇవాళ వ్యాఖ్యానించారు. దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి వెళ్లిన ఆయన.. ఇవాళ జ్యూరిచ్ లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు పారిశ్రామికవేత్తను ఉద్దేశించి మాట్లాడిన భరత్.. ఏపీలో పరిశ్రమలు పెడితే, పెట్టుబడులు పెడితే ఏమవుతుందనే డౌట్ ఉందని భరత్ తెలిపారు. కానీ సొంత తల్లి, చెల్లికి న్యాయ చేయని వాడు ప్రజలకు ఏం చేస్తాడని జగన్ పై విమర్శలు గుప్పించారు.

టీడీపీ కొన్ని దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలిస్తుందని టీజీ భరత్ ధీమా వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ ఉన్నత విద్యావంతుడని, తమ పార్టీ ప్రజాప్రతినిధుల్లో స్టాన్ ఫోర్డ్ నుంచి చదివిన వారు లేరన్నారు. దీర్ధకాలిక విజన్ ఉన్న పార్టీ టీడీపీ అన్నారు. పార్టీ భవిష్యత్ లోకేష్ అని, కాబోయే ముఖ్యమంత్రి కూడా లోకేష్ అన్నారు. అలాగే రామ్మోహన్ నాయుడు కూడా కేంద్ర మంత్రివర్గంలో అతి పిన్న వయస్కుడు అన్నారు. ఏపీలో ప్రతీ జిల్లా కేంద్రంలో ఎయిర్ పోర్ట్ రావాలన్న చంద్రబాబు ఉద్దేశం ప్రకారం రామ్మోహన్ పనిచేస్తున్నారన్నారు.

ఏపీకి సీబీఎన్ బ్రాండ్ అనేది అదనపు అర్హత అన్నారు. తాను ఛాట్ జీపీటీ ఎక్కువగా వాడతానని టీజీ భరత్ తెలిపారు. అందులో ఒక వేళ చంద్రబాబు రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఏమయ్యే వారని ప్రశ్నిస్తే ఇండియాకు మరో ఎలాన్ మస్క్ అయ్యేవారని జవాబు ఇచ్చిందని వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+