సూపర్: కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించిన ఏపీ మంత్రి యనమల
యాదగిరిగుట్ట: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశంసలు కురిపించారు.
చదవండి: రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పదవి ఆలస్యం అవుతుందా?
కోట్లాది రూపాయలతో యాదాద్రి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ అభినందనీయుడన్నారు. ఆదివారం ఆయన కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.

ఈ సందర్బంగా మాట్లాడారు. దేవాలయాలను అభివృద్ది చేయడమంటే చరిత్రను కాపాడటమే అన్నారు. అలాగే రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని, యాదాద్రి దేవస్థానానికి గొప్ప సైకలాజికల్ చరిత్ర ఉందన్నారు.
ఏపీకి తిరుమల వలే తెలంగాణకు యాదాద్రి క్షేత్రం తలమానికంగా నిలవాలని ఆశిస్తున్నానని, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాలను రక్షించుకోవాల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాలపై ఉందన్నారు.












Click it and Unblock the Notifications