ఆ తర్వాతే రేవంత్‌కు పదవి, వ్యూహం మార్చిన కాంగ్రెస్: రేణుకా చౌదరితో భేటీ
ఇటీవలే ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి ఇప్పుడప్పుడే పదవి కట్టబెట్టే అవకాశాలు లేవా? అంటే అవుననే అంటున్నారు.
హైదరాబాద్: ఇటీవలే ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి ఇప్పుడప్పుడే పదవి కట్టబెట్టే అవకాశాలు లేవా? అంటే అవుననే అంటున్నారు.
Recommended Video

రేవంత్ రెడ్డి చేరికను చాలామంది కాంగ్రెస్ నేతలు స్వాగతిస్తున్నారు. కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో ఉండటం, వచ్చీ రాగానే ఆయనకు పదవి ఇవ్వడం ఏమిటని కొందరు వాపోతున్నారు.

ఆ తర్వాత రేవంత్ రెడ్డికి పదవి
కొందరు కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తి నేపథ్యంలో రేవంత్ రెడ్డికి పదవి ఇచ్చే అంశాన్ని కొన్నాళ్లు పక్కన పెట్టాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. కొద్ది రోజుల పాటు ఆయనకు ఏ పదవి దక్కకపోవచ్చునని తెలుస్తోంది. సీనియర్లతో మాట్లాడి అందరిని చల్లబరిచిన తర్వాత ఆయనకు పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఆయన పార్టీలో చేరగానే కొద్ది రోజుల్లో పదవి వస్తుందని భావించారు. కానీ ఇప్పుడు సీనియర్లను చల్లబరిచాక ఇవ్వాలని భావిస్తోంది.

వరుసగా నేతలను కలుస్తున్నారు
అందులో భాగంగానే ఆయన పలువురు నేతలతో భేటీ అవుతున్నారు. ఇటీవల డీకే అరుణ సహా పలువురుతో రేవంత్ మాట్లాడారు. తాజాగా రేణుకా చౌదరిని కలిశారు.

కాంగ్రెస్‌లో ఎందుకు చేరానంటే
శనివారం నాడు రేవంత్ రెడ్డి తనతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన వేం నరేందర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిని హైదరాబాదులో కలిశారు. తాను పార్టీలోకి వచ్చిన పరిస్థితులు, తాను మసలుకునే విధానం వారికి చెప్పారని సమాచారం. అందరికీ అదే విషయం చెబుతున్నారని తెలుస్తోంది. కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెబుతున్నారట.

రేవంత్ అందరినీ ఆకట్టుకునే వ్యక్తి
కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతా రెడ్డి స్పందించారు. రేవంత్ ప్రజలను ఆకట్టుకొనే వ్యక్తి అన్నారు. కాంగ్రెస్‌లో రేవంత్ చేరికను స్వాగతించారు. ఆయన రాకతో పార్టీకి మరింత బలం చేకూరుతుందన్నారు.

కొడంగల్‌కు ఉప ఎన్నికలు రాకపోవచ్చు
కొడంగల్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రాకపోవచ్చని గీతా రెడ్డి అభిప్రాయపడ్డారు. కాగా, రేవంత్ రెడ్డి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే ఇది తెలంగాణ స్పీకర్‌కు చేరాల్సి ఉంది. చేరిన తర్వాత రాజీనామా ఆమోదిస్తారా, ఏం జరుగుతుందనేది తేలనుంది.
-
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
Charminar Express: చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్-రూట్ మార్పు..! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
ఉచిత బస్సే జిందా తిలిస్మాత్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ











Click it and Unblock the Notifications