Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యుద్ధం వేళ.. కిమ్ అనూహ్య చర్యలు

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ నిర్వహిస్తోన్న జాయింట్ మిలటరీ ఆపరేషన్స్ 15వ రోజుకు చేరుకుంది. దీనికి ముగింపు మాత్రం కనపించట్లేదు. గల్ఫ్ ప్రాంతంలో ఇంధన సరఫరాలు, అంతర్జాతీయ ప్రయాణాలు, భద్రతకు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. వీరిలో ఎక్కువ మంది ఇరాన్‌కు చెందిన వాళ్లే. లెబనాన్, గల్ఫ్ దేశాల్లో కూడా మరణాలు నమోదయ్యాయి.

ఈ పరిణామాల మధ్య ఉత్తర కొరియా తెరమీదికి వచ్చింది. తూర్పు తీరం నుంచి ఓ అనుమానాస్పద శక్తిమంతమైన బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. దక్షిణ కొరియా, జపాన్ ఈ ప్రయోగాన్ని ధృవీకరించాయి కూడా. ప్రయోగించిన వెంటనే ఆ క్షిపణి సముద్రంలో పడిపోయిందని జపాన్ సైన్యాధికారులు తెలిపారు. ఇది ఉత్తర కొరియా తమ సైనిక శక్తిని ప్రదర్శించే ప్రయత్నంగా భావిస్తున్నారు. యుద్ధం అరంభమైన తర్వాత నార్త్ కొరియా బాలిస్టిక్ మిస్సైళ్లను సంధించడం ఇది రెండోసారి.

North Korea Fires Suspected Ballistic Missile Following Cruise Missile Test Japanese Military Detects

ఇది- ఉత్తర కొరియా యుద్ధ సన్నద్ధతకు అద్దం పట్టినట్టయింది. అంతకుముందు జనవరి 27న కూడా ఉత్తర కొరియా తూర్పు సముద్రం వైపు అనేక షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ అందించిన వివరాల ప్రకారం- ఉత్తర కొరియా తూర్పు దిశలో ఒక అజ్ఞాత వస్తువును ప్రయోగించిందని, ఇది లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అయి ఉండవచ్చని అంచనా వేస్తోన్నట్లు దక్షిణ కొరియా 'జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్' ప్రకటించింది. తమ సైనిక అధికారులు ఈ ప్రయోగాన్ని స్పష్టంగా గుర్తించినట్లు తెలిపారు.

జపాన్ కూడా ఈ పరిణామంపై స్పందించింది. నిశితంగా పరిశీలిస్తోన్నామని తెలిపింది. ఉత్తర కొరియా ప్రయోగించినది బాలిస్టిక్ క్షిపణి అయి ఉండవచ్చని జపాన్ సైన్యం పేర్కొంది. ఈ అనుమానాస్పద బాలిస్టిక్ క్షిపణి అప్పటికే సముద్రంలో పడిపోయిందని జపాన్ కోస్ట్ గార్డ్ అధికారులు ధృవీకరించారు. ఉత్తర కొరియా నిర్వహించిన ఈ తాజా మిస్సైల్ టెస్ట్.. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా తమ వార్షిక సైనిక విన్యాసాలు 'ఫ్రీడమ్ షీల్డ్' నిర్వహిస్తున్న సమయంలో చోటు చేసుకుంది.

ఈ రెండు దేశాల సైనిక విన్యాసాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది ఉత్తర కొరియా. వాటిని యుద్ధ సన్నాహాలుగా పరిగణిస్తోంది. తాజాగా నిర్వహించిన ఈ క్షిపణి ప్రయోగం అమెరికా, దక్షిణ కొరియాల సంయుక్త విన్యాసాలకు ప్రతిస్పందనగా తన సైనిక సామర్థ్యాలను ప్రదర్శించే ఒక ప్రయత్నంగా అభివర్ణిస్తోన్నారు. ఇరాన్ యుద్ధం రోజురోజుకూ తీవ్రతరమౌతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+