ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ
టాలీవుడ్ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది "మృణాల్ ఠాకూర్". బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వెండితెరపై సందడి చేసింది. ఆ విధంగా బాలీవుడ్‌లో కెరీర్ ప్రారంభించినా కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.
అయితే టాలీవుడ్‌లో తన మొదటి సినిమా 'సీతారామం' బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మ ఫుల్ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో 'హాయ్ నాన్న' మూవీతో ఆడియన్స్ ని మెప్పించినా.. విజయ్ దేవరకొండతో చేసిన 'ఫ్యామిలీ స్టార్' చిత్రం ప్రేక్షకులను నిరాశ పరిచింది. ప్రస్తుతం అడివి శేష్ సరసన 'డెకాయిట్' అనే యాక్షన్ డ్రామాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్ మొదట్లో ఓ హీరోతో లిప్ లాక్ సీన్స్ చేయడం వల్ల తన తల్లిదండ్రులు మండిపడ్డారని ఓపెన్ అయ్యింది. తర్వాత ప్రాజెక్టులలో అలాంటి సీన్స్ చేయకూడదని కండీషన్ పెట్టారని చెప్పుకొచ్చింది. ఆ కారణం వల్లే ఎన్నో అవకాశాలు కోల్పోయానని అన్నారు. దాంతో చివరకు తన తల్లిదండ్రులను ఒప్పించి తర్వాత చిత్రాల్లో లిప్ లాక్, రొమాంటిక్ సీన్స్ చేశానని ఓపెన్ అయ్యింది.
ధనుష్‌తో ప్రేమ పుకార్లు..
కాగా గత కొన్ని నెలలుగా, మృణాల్ ఠాకూర్ తమిళ స్టార్ హీరో ధనుష్‌తో రిలేషన్ లో ఉన్నట్టు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పలు పబ్లిక్ ఈవెంట్స్‌లో వారిద్దరూ కలసి కనిపించడం, ప్రత్యేకించి ఫ్రెండ్లీ బాండింగ్‌లో ఉండటం ఈ ఊహాగానాలకు మరింత ఊపునిచ్చింది. 2022లో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో తన 18 ఏళ్ల వివాహ బంధాన్ని ముగించారు. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. దాంతో వీరు డేటింగ్ లో ఉన్నారని సోషల్ మీడియాలో సైతం చర్చ నడిచింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తుంది. కానీ అవి రూమర్లు గానే మిగిలిపోయాయి.
మరోవైపు సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ విషయాలతో పాటు మూవీకి సంబంధించిన విషయాలను కూడా పంచుకుంటూ ఫాలోవర్స్ తో టచ్ లో ఉంటుంది. తన ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.













Click it and Unblock the Notifications