Murali Naik: 140 కోట్ల మంది కోసం ఆంధ్రా జవాన్ పాక్ కాల్పుల్లో వీరమరణం..! మురళీ నాయక్ కు సంతాపాల వెల్లువ

భారత్-పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో సాగుతున్న పోరులో ఏపీలోని సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో పాల్గొంటున్న మురళీ నాయక్ తాజాగా పాక్ జరిపిన కాల్పుల్లో చనిపోయినట్లు తెలుస్తోంది. దీంతో సత్యసాయి జిల్లాలోని ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. జవాన్ మృతిపై సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన తెలుగు జవాన్ మురళీనాయక్ త్యాగం మరువలేనిదని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాడకు చెందిన జవాన్ మురళీనాయక్ యుద్ధభూమిలో మరణించారన్న వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. జవాన్ మురళీ నాయక్ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. అమర జవాన్ మురళీనాయక్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జవాన్ మురళీనాయక్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

ap ministers condolences to soldier murali naik s death in wag against pakistan

దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలర్పించిన అమర వీరుడు మురళీ నాయిక్ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. పాకిస్తాన్ తో యుద్దంలో సత్యసాయి జిల్లాకు చెందిన సైనికుడు మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు. సరిహద్దుల్లో మురళీ నాయిక్ ప్రదర్శించిన ధైర్య సాహసాలు దేశానికే కాక రాష్ట్ర ప్రజలందరికీ స్ఫూర్తిదాయకం అని తెలిపారు. మురళీ నాయిక్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అటు పాకిస్తాన్ కాల్పుల్లో రాష్ట్రానికి చెందిన వీరజవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందినది ఎంతగానో బాధాకరమని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. దేశ భద్రత కోసం తన ప్రాణాలను అర్పించిన మురళీ నాయక్ సేవలు చిరస్మరణీయమైనవిగా నిలిచిపోతాయన్నారు. దేశ రక్షణలో ఆయన చూపిన ధైర్యసాహసాలు, పోరాట పటిమకు యావత్ దేశం గర్విస్తోందన్నారు. మురళీ నాయక్ ఈ త్యాగంతో చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఆయన మృతిపై భారత ప్రజలందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.

మరోవైపు దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి నివాళులు తెలిపారు. మాతృ భూమి కోసం అమరుడై ప్రాణాలర్పించిన మురళి నాయక్ సేవలు దేశం మరువదన్నారు. దేశం కోసం మీరు చేసిన సేవలు వృధా కావన్నారు. మీరు అమరులైన మా స్మృతి లో సజీవులే అన్నారు. దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని ఆమె తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+