అమరావతిలో పులస చేప..! కేతిరెడ్డి సెటైర్లపై మంత్రుల ఫైర్..!

అమరావతి రాజధానిలో వరదల కారణంగా తలెత్తిన ముంపు పరిస్దితులపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తాజాగా సెటైర్లు వేశారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ... మ‌రో రెండు సంవ‌త్స‌రాల్లో అమ‌రావ‌తిలో పుల‌స చేప‌ దొరుకుతుందన్నారు. గోదావరి జిల్లాల్లోనే కాదు పులస చేప‌ను అమ‌రావ‌తిలో ప‌ట్టి ఇస్తామంటూ అమరావతి వరదలపై ఆయన వ్యంగాస్త్రాలు సంధించారు. దీనిపై టీడీపీ మంత్రులు ఇవాళ ఘాటుగా స్పందించారు.

అమరావతిలోని కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం వల్ల నీరు నిలిచిపోయిన నీరుకొండ పరిసర ప్రాంతాల్ని ఇవాళ మున్సిపల్ మంత్రి నారాయణ పరిశీలించారు. పశ్చిమ బైపాస్ రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణంతో కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం ఏర్పడిందన్నారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో మట్టిని అడ్డు వేసి వదిలేయడంతో వాగు ప్రవాహానికి ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. అడ్డుగా ఉన్న మట్టిని తొలగించడంతో పాటు వెస్ట్ బైపాస్ రోడ్డుకు రెండు చోట్ల గండ్లు కొట్టి నీరు వెళ్లేలా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ap ministers counter attack against former ysrcp mla kethireddy s Amaravati pulasa fish remark

అమరావతిపై ఏడుపులు ఇకనైనా ఆపాలని వైసీపీ నేతలకు సూచించారు. లేదంటే ఆ 11 సీట్లు కూడా రావన్నారు. నిర్మాణాలు జరిగేటప్పుడు వర్షం వస్తే గుంతల్లోకి నీళ్లు రావా...? అని నారాయణ ప్రశ్నించారు. గుంతల్లోకి నీరు వస్తే ఐకానిక్ భవనాలు మునిగిపోయినట్లేనా? అని అడిగారు. పశ్చిమ బైపాస్ పై బ్రిడ్జి నిర్మించిన దగ్గర మట్టి అడ్డుగా ఉండటంతో నీరు నిలిచిపోయిందని, అది కూడా కేవలం రెండు గ్రామాల పరిధిలో మాత్రమే పొలాల్లో నీరు నిలిచిందన్నారు. మిగతా గ్రామాల్లో వర్షం పడిన కొన్ని గంటల్లోనే నీరు బయటకు వెళ్ళిపోయిందన్నారు. రాజధాని మునిగిపోతుందంటున్న వారు ఇక్కడికి వచ్చి చూడాలన్నారు. కారణాలు తెలియకుండా వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు సహించరన్నారు.

ap ministers counter attack against former ysrcp mla kethireddy s Amaravati pulasa fish remark

హోంమంత్రి అనిత కూడా వైసీపీ నేతల విమర్శలు, సోషల్ పోస్టులపై పైర్ అయ్యారు. అమరావతి అభివృద్ధి చెందడాన్ని
ఓర్చుకోలేకపోతున్నారని తెలిపారు. అమరావతిపై లేనిపోని రాతలు రాసే వారిపై కేసులు పెడతామన్నారు. విజయవాడ మునిగిపోయిందని మరో మీడియా రాసిందని, ధైర్యం ఉంటే రాజకీయంగా రండి, పోరాటం చేద్దాం, మీరు పెట్టిన పోస్టులపై రాజ ద్రోహం కేసులు పెట్టాలన్నారు. సోషల్ మీడియా పోస్టులపై లీగల్ చర్యలు తీసుకుంటామని, ఆయా పోస్టులపై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. నిజ నిజాలు పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+