నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిజమా కాదా చెప్పు, వైసిపి కార్యకర్తలు ఆలోచించాలి: జగన్‌కు మంత్రులు

వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రులు అచ్చెన్నాయుడు, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, నక్కా ఆనంద్ బాబులు గురువారం బహిరంగ లేఖ రాశారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రులు అచ్చెన్నాయుడు, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, నక్కా ఆనంద్ బాబులు గురువారం బహిరంగ లేఖ రాశారు.

చదవండి: ప్రశ్న: 'రామ్‌నాథ్ కోవింద్ కాళ్లకు జగన్ మొక్కవచ్చా?', బిజెపికి మద్దతుపై ట్విస్ట్

24 ప్రశ్నలతో లేఖ రాశారు. ప్లీనరీ జరుపుకునే అర్హత ఉందా? అభివృద్ధికి జగన్ ఎప్పుడైనా సలహాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు.

జగన్ పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని, ఫుల్ టైమ్ నిరోధకుడు అని మంత్రులు నిప్పులు చెరిగారు. ఈ మూడేళ్లలో జగన్ అర్థంపర్థం లేని విమర్శలు, ఆరోపణలు చేయడం మినహా నిర్మాణాత్మక సలహా ఇచ్చింది ఒక్కటి లేదన్నారు.

చంద్రబాబు ఘనత కనిపించడం లేదా

చంద్రబాబు ఘనత కనిపించడం లేదా

ఇన్నాళ్లు పులివెందులకు నీటి కష్టాలు ఉన్నాయని, కానీ తాము అధికారంలోకి వచ్చాక ఇప్పుడు పులివెందులకు నీరు ఇచ్చామని, ఇది చంద్రబాబు ఘనత అని, అది ప్రతిపక్ష నేత జగన్‌కు కనిపించడం లేదా అని మంత్రులు ప్రశ్నించారు.

Recommended Video

Ysrcp Sitting MLA's Anxity For Tickets In 2019 Elections
నిజం కాదా చెప్పాలి.. అమరావతికి రుణాలు ఇవ్వొద్దని లేఖ

నిజం కాదా చెప్పాలి.. అమరావతికి రుణాలు ఇవ్వొద్దని లేఖ

రాజధాని అమరావతి నిర్మాణానికి రుణాలు ఇవ్వొద్దని రైతుల పేరుతో జగన్ ప్రపంచ బ్యాంకుకు లేఖ రాయడం నిజం కాదా చెప్పాలని మంత్రులు లేఖలో నిలదీశారు. జగన్ అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు.

వైసిపి కార్యకర్తలూ! ఆలోచించండి

వైసిపి కార్యకర్తలూ! ఆలోచించండి

నిత్యం నవ్యాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న జగన్ వైఖరిపై వైసిపి కార్యకర్తలు, ఆ పార్టీ మద్దతుదారులు ఓసారి ఆలోచించాలని మంత్రులు లేఖలో కోరారు.

పక్క రాష్ట్రంలో రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు

పక్క రాష్ట్రంలో రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు వైసిపి మద్దతును తాము తప్పు పట్టడం లేదని, కానీ గతంలో ఆయన ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు. అంతేకాకుండా కోవింద్‌ను ఆయన పక్క రాష్ట్రమైన తెలంగాణలో కలిశారని మండిపడ్డారు.

ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగడంపై దేవినేని

ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగడంపై దేవినేని

వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జగన్ చేసిన పాపానికి ఐఏఎస్‌లు బలి అయ్యారని మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు వేరుగా అన్నారు. జగన్ వందమంది ప్రశాంత్ కిషోర్‌లను తెచ్చుకున్నా ఏం కాదన్నారు. యూపీలో ప్రశాంత్ కిషోర్ విఫలమయ్యారని, యూపీలో రాహుల్ గాంధీకి పట్టిన గతే జగన్‌కు ఏపీలో పడుతుందన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి అధికారంలోకి రావాలనుకోవడం విడ్డూరమన్నారు.

English summary
AP Ministers Adinarayana Reddy, Amarnath Reddy wrote open letter to YSR Congress party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X