ap municipal poll results 2021 : జోరుగా ఫ్యాన్‌ గాలి- చేతులెత్తేసిన విపక్షాలు

ఏపీలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా పలు కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఫ్యాన్‌ గాలి జోరుగా వీస్తోంది. ఱధికార వైసీపీ ఈ ఎన్నికలను క్లీన్‌ స్వీప్‌ చేసే దిశగా పరుగులు తీస్తోంది. విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన కొంత మేర వార్డులు, డివిజన్ల స్ధాయిలో ప్రభావం చూపుతున్నాయి. మరికొన్ని చోట్ల బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు సింగిల్ డిజిట్‌ స్ధానాలు కైవసం చేసుకుంటున్నాయి. తొలి ఫలితాల సరళి గమనిస్తే ఈ ఎన్నికల్లో వైసీపీకి విపక్షాలు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయినట్లు స్పష్టమవుతోంది.

మున్సిపల్‌ ఫలితాల్లో జోరుగా ఫ్యాన్‌ గాలి

మున్సిపల్‌ ఫలితాల్లో జోరుగా ఫ్యాన్‌ గాలి

ఏపీలో ఈ నెల 10న జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగిస్తున్నట్లు తాజా ఫలితాలు వెల్లడిస్తున్నాయి. రాష్టవ్యాప్తంగా పలు కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ వైసీపీ ఇప్పటికే మెజారిటీ స్ధానాలు కైవసం చేసుకుంది. ఉదయం 11 గంటల సమయానికి వైసీపీ మొత్తం ఎన్నికలు జరిగిన 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో సగానికి పైగా స్ధానాల్లో ఆధిక్యం కొనసాగిస్తోంది. అలాగే ఎన్నికలు జరిగి ఓట్లు లెక్కిస్తున్న 10 కార్పోరేషన్లలోనూ వైసీపీ ఆధిక్యం కొనసాగుతోంది. మరికొన్ని చోట్ల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.

 రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవా

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ హవా

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల్లో మెజారిటీ మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పోరేషన్లలో వైసీపీ హవానే కొనసాగుతోంది. వైసీపీ గెల్చుకున్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రకాశం జిల్లా మార్కాపురం, అద్దంకి, కనిగిరి, గిద్దలూరు, చీమకుర్తి, కర్నూలు జిల్లా ఆత్మకూరు, డోన్‌, ఎమ్మిగనూరు, గూడూరు, నందికొట్కూరు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు, నాయుడుపేట, అనంతపురం జిల్లా మడకశిర, కడప జిల్లా రాయచోటి, ఎర్రగుంట్ల, శ్రీకాకుళం జిల్లా పలాస, తూర్పుగోదావరి జిల్లా తుని, చిత్తూరు జిల్లా మదనపల్లె, గుంటూరు జిల్లా వినుకొండ, సత్తెనపల్లి, చిలకలూరిపేట, రేపల్లె ఉన్నాయి. కనిగిరి, రాయచోటిలో అయితే అన్ని వార్డుల్నీ దక్కించుకుని వైసీపీ క్లీన్ స్వీప్‌ చేసింది.

కార్పోరేషన్లలోనూ వైసీపీ జోరు

కార్పోరేషన్లలోనూ వైసీపీ జోరు

అటు కార్పోరేషన్ ఫలితాల్లోనూ వైసీపీ సత్తా చూపుతోంది. ఇప్పటివరకూ ఎన్నికలు జరిగి కౌంటింగ్‌ జరగని ఏలూరు కార్పోరేషన్‌ మినహాయిస్తే మిగిలిన కార్పోరేషన్లలో వైసీపీ అధిక్యం సాగుతోంది. కడప, తిరుపతి, చిత్తూరు కార్పోరేషన్లు వైసీపీ ఖాతాలో చేరిపోయాయి. ఆయా చోట్ల వైసీపీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. విజయవాడ, గుంటూరు, విశాఖ, ఒంగోలు సహా పలు కార్పోరేషన్లలో హోరాహోరీ ఎన్నికలు జరిగాయని భావించినా వైసీపీ అక్కడా స్పష్టమైన ఆధిక్యం చూపుతోంది. దీంతో దాదాపు అన్ని కార్పోరేషన్లనూ వైసీపీ గెల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 మున్సిపల్‌ ఫలితాల్లో చేతులెత్తేసిన విపక్షాలు

మున్సిపల్‌ ఫలితాల్లో చేతులెత్తేసిన విపక్షాలు

తాజా మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ జోరుతో విపక్షాలు పూర్తిగా చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో ఏ ఒక్క కార్పోరేషన్, మన్సిపాలిటీ, నగర పంచాయతీలోనూ విపక్షాలు ఆధిక్యంలో లేకపోవడం వారి పరిస్ధితి తెలియజేస్తోంది. ఉభయగోదావరి జిల్లాలతో పాటు పలు చోట్ల టీడీపీ, జనసేన పరస్పరం అవగాహనతో పోటీ చేయడం వల్ల పలు వార్డులు, డివిజన్లను చేజిక్కించుకుంటున్నాయి. దీంతో ఇదొక్కటే వారికి ఊరటగా కనిపిస్తోంది. కీలకమైన విజయవాడ, విశాఖ, గుంటూరు కార్పోరేషన్లలో సైతం టీడీపీ అభ్యర్ధులు వెనుకంజలో ఉండటం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+