పదేళ్లకి బాబు హ్యాపీ!: జగన్‌పై లెక్క, కెసిఆర్‌కు మిశ్రమం

హైదరాబాద్: మున్సిపల్ ఫలితాలు తెలుగుదేశంలో నూతనోత్సాహాన్ని నింపగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చేదును మిగిల్చాయి. ఈ ఫలితాలు తెలంగాణ రాష్ట్ర సమితికి అటు చేదు కాదు, ఇటు ఆనందం కాదనే చెప్పవచ్చు. కాంగ్రెసు పార్టీకి తెలంగాణలో కొత్త ఊపును ఇవ్వగా, సీమాంధ్రలో అదే పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది.

తెలంగాణలో తెరాస, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉంటుందని, ఆ పార్టీల విజయం ఏకపక్షంగా ఉంటుందని చాలామంది భావించారు. అయితే సీన్ రివర్స్ అయింది. సీమాంధ్రలో టిడిపి ఏకపక్ష విజయం దక్కించుకోగా, తెలంగాణలో కాంగ్రెసు పార్టీ దాదాపు సగం స్థానాలలో విజయ కేతనం ఎగురవేసింది.

AP municipal results: TDP leads in Seemandhra, Congress in Telangana

రెండో స్థానంలో టిడిపి, బిజెపి కూటమి ఉంది. టిడిపి, బిజెపిలను వేర్వేరుగా చూస్తే తెరాస రెండో స్థానంలో ఉంటుంది. ఆ పార్టీల మున్సిపాలిటీలు కలిస్తే మాత్రం తెరాస మూడో స్థానంలో ఉన్నట్లే! తెలంగాణలో టిడిపి పూర్తిగా తుడిచి పెట్టుకుపోతుందని అందరూ భావించినప్పటికీ.. ఆ పార్టీ ఆరు స్థానాలను కైవసం చేసుకుంది. కెసిఆర్ పోటీ చేసిన గజ్వెల్లో టిడిపి ఎక్కువ స్థానాలను గెలుచుకోవడం గమనార్హం.

పదేళ్ల తర్వాత టిడిపికి మంచి ఉత్సాహాన్నిచ్చే ఫలితాలు వచ్చాయి. సీమాంధ్ర మున్సిపల్ ఫలితాలు తమకు అనుకూలంగా ఉండటంతో తెలుగు తమ్ముళ్లు మిఠాయిలు పంచుకొని, బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ ఫలితాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జీర్ణించుకోలేకపోతోంది.

అయితే, అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో మాత్రం తమ పార్టీదే గెలుపు అని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల నాటికి తాము సిద్ధంగా లేమని ఆ పార్టీ చెబుతోంది. ఫలితాల పైన జగన్ పార్టీ, తెరాసలు అంతర్మథనం చెందుతున్నాయి. ఫలితాలను సమీక్షించుకుంటున్నాయి.

వేలల్లో.. వందల్లో...

మున్సిపల్ ఫలితాల నేపథ్యంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లోను తామే విజయం సాధిస్తామని టిడిపి ధీమా వ్యక్తం చేస్తోంది. అందుకు పలు ఉదాహరణలు చూపిస్తోంది. కొత్త రాష్ట్రం నేపథ్యంలో చంద్రబాబు అయితేనే సీమాంధ్రను అభివృద్ధి చేస్తారని ప్రజలు నమ్మారన్నారు. తాము అత్యధిక స్థానాల్లో గెలిచామని, జగన్ పార్టీ కేవలం పందొమ్మిది స్థానాలకే పరిమితమైందంటున్నారు.

అంతేకాకుండా తాము గెలుపొందిన చోట అత్యధిక మెజార్టీతో విజయం సాధించామని, కొన్ని స్థానాలే గెలిచిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆ విజయాలను కూడా తక్కువ మెజార్టీతోనే కైవసం చేసుకుందని వారు చెబుతున్నారు. ఈ లెక్కలు చూస్తుంటే తమ గెలుపు ఖాయమని చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ తోడు...

మున్సిపల్ ఎన్నికలు జరిగిన సమయంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మద్దతు, నరేంద్ర మోడీ ఇప్పుడున్నంతగా లేదని, సార్వత్రిక ఎన్నికల సమయంలో మాత్రం తమకు పవన్ మద్దతివ్వడంతో పాటు మోడీ హవా మరింత పెరిగిందని చెబుతున్నారు. ఈ పరంగా చూసినా టిడిపికి అత్యధిక అసెంబ్లీ, లోకసభ స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అటు ఫట్, ఇటు హిట్

కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర ప్రాంతంలో తుడిచి పెట్టుకుపోగా, తెలంగాణలో ముందంజలో నిలిచింది. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ కనీసం ఎక్కడ కూడా పోటీని కూడా ఇవ్వలేకపోయింది. కనీసం ఒక్క మున్సిపాలిటీని కూడా దక్కించుకోలేకపోయింది. అదే తెలంగాణలో మాత్రం అందరికంటే ముందంజలో నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+