Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె-35 వేల మంది విధుల బహిష్కరణ-డిమాండ్లు ఇవే

ఏపీలో మన్సిపల్ కార్మికుల సమ్మె మొదలైంది. అపరిషృతంగా ఉన్న పలు కీలక డిమాండ్లపై అసంతృప్తిగా ఉన్న కార్మికులు ఇవాళ్టి నుంచి సమ్మెలోకి వెళ్లారు. చెత్త సేకరణ సహా అన్ని పనుల్ని నిలివేశారు. దీంతో అసలే వర్షాకాలంలో అంతంతమాత్రంగా ఉన్న పారిశుద్ధ్యం మరింత క్షీణించే ప్రమాదం కనిపిస్తోంది. మున్సిపల్ కార్మికుల సమ్మెపై స్పందించిన ప్రభుత్వ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడతామని చెబుతోంది.

మున్సిపల్ సమ్మె

మున్సిపల్ సమ్మె

ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఇవాళ ప్రారంభమైంది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు జీతాలు, వేతనాల పెంపు, పీఆర్సీ అమలు, ఆదివారం సెలవు వంటి డిమాండ్లపై ఉన్నతాధికారులతో చర్చిస్తున్న వీరంతా సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలోని పట్టణ, నగర పాలక సంస్ధల పరిధిలో ఈ సమ్మె ప్రభావం చూపబోతోంది. ఈ సమ్మెలో మున్సిపల్ కార్మిక సంఘాలన్నీ ఉమ్మడిగా పాల్గొంటుండటంతో తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.

 35 వేల మంది విధుల బహిష్కరణ

35 వేల మంది విధుల బహిష్కరణ

మున్సిపల్ కార్మికులు ఏపీలోని పట్టణాలు, నగరాల్లో చేపట్టిన ఈ సమ్మెలో 35 వేల మందికి పైగా కార్మికులు పాల్గొంటున్నారు. దీంతో వీరంతా నిన్న అర్ధరాత్రి నుంచి విధులు బహిష్కరించారు. మున్సిపల్ కార్యాలయాల ముందు ఉదయం నుంచి ఆందోళనలు చేపట్టారు. ఇందులో కార్మిక సంఘాలన్నీ ఏకతాటిపైకి రావడంతో సమ్మె ప్రభావం కనిపిస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. దీంతో సమ్మెపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

కార్మికుల డిమాండ్లు ఇవే

కార్మికుల డిమాండ్లు ఇవే

ఇవాళ సమ్మెలోకి వెళ్లిన కార్మిక సంఘాలు ప్రధానంగా 9 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాయి. వీటిపై ఇప్పటికే పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సమ్మెలేకి వెళ్తున్నట్లు కార్మిక నేతలు చెప్తున్నారు. ఈ డిమాండ్లలో బకాయిలతో సహా ఆరోగ్యభత్యం చెల్లించాలని, 11వ పీఆర్సీ ప్రకారం నెలకు రూ.20వేలు జీతం ఇవ్వాలని, డీఏ ఇవ్వాలని కోరుతున్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను క్రమబద్ధీకరించాలని, విస్తరిస్తున్న పట్టణాలు, నగరాలకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని వారు కోరుతున్నారు. ఆప్కాస్ ద్వారా రిటైర్ అయిన కార్మికులకు ఆర్దిక ప్రయోజనాలతో పాటు వారి పిల్లలకు ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ, పెన్షన్ చెల్లింపులు చేయాలని కోరుతున్నారు. ఇంజనీరింగ్ కార్మికులకు జీవో 30 ప్రకారం నైపుణ్యేతల జీతాలివ్వాలని, శాశ్వత ఉద్యోగులకు ఆర్జిత సెలవులు, జీపీఎఫ్ ఖాతాలు తెరవడం, హెల్త్ కార్డుల మంజూరీ వంటివి ఉన్నాయి. అలాగే ఎన్ఎమ్ఆర్ లకు టైమ్ స్కేల్ డీఏ, స్కూళ్లలో ఆయాలకు కనీస వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+