ఏపీ కొత్త ఎస్ఈసీగా మన్మోహన్ సింగ్..? మరో ఆర్డినెన్స్ జారీకి సర్కార్ కసరత్తు
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఎన్నికల కమిషనర్‌ను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కమిషనర్‌గా కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అక్కడ తమకు అనుకూలంగా తీర్పు వస్తే.. మరోకరిని కమిషనర్‌గా నియమించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకు పలువురి పేర్లు పరిశీలనలో రాగా.. ముందువరసలో మన్మోహన్ సింగ్ పేరు వినిపిస్తోంది.

సెక్షన్ 200
పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 200 ప్రకారం ఎన్నికల కమిషనర్‌ను ప్రభుత్వం సూచనతో గవర్నర్ నియమించాలనే అంశాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. ఇప్పుడే కాదు 1994 నుంచి ఎన్నికల కమిషనర్ నియామకాలు అలానే జరిగాయని కనకరాజు తరఫున న్యాయవాదులు చెబుతున్నారు. సుప్రీంకోర్టులో ఇదే అంశంపై పోరాడుతామని.. తమకు అనుకూలంగా తీర్పు వస్తోందని భావిస్తున్నారు.

సుప్రీం స్టే ఇస్తే...?
నిమ్మగడ్డ పిటిషన్‌పై హైకోర్టు ఇఛ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధిస్తే.. మధ్యేమార్గంగా కొత్త ఎన్నికల కమిషనర్ నియమించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం ఇదివరకు మాదిరిగా ఉన్న నిబంధనల ప్రకారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి... ఆ పై స్థాయిలో పనిచేసినవారిని నియమిస్తామని చెబుతోంది. అందుకోసం మన్మోహన్ సింగ్ పేరును పరిశీలిస్తోంది. మన్మోహన్ సింగ్ ప్రత్యేక సీఎస్ క్యాడర్‌లో రిటైరనందున ఆయనవైపు ప్రభుత్వం మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.

2 నెలల గడువు
హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత అమలు చేయకుంటే 2 నెలల వ్యవధి ఉంటుంది. ఇదే విషయాన్ని ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరాం తెలిపారు. అప్పటివరకు కోర్టులో వాదోపవాదనలు జరుగుతాయి. కానీ రాజ్యాంగబద్దమైన పదవీని ఖాళీగా ఉంచకూడదని... స్థానిక సంస్థల ఎన్నిక ప్రక్రియ మధ్యలో ఉన్నందున ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించిందని తెలుస్తోంది. కానీ ఇప్పుడున్న పంచాయతీరాజ్ చట్టంలో అలాంటి వెసులుబాట్లు లేవు. కమిషనర్ పోస్టు ఖాళీ అయితే చట్టాన్ని సవరించి.. మరో ఆర్డినెన్స్ జారీచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలా జారీచేసి మన్మోహన్ సింగ్‌ను నియమించాలనే ఆలోచన చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Recommended Video

కమిషనర్ కోసం కసరత్తు...?
కొత్త కమిషనర్ నియమించడానికి కసరత్తు ప్రారంభమైందని సమాచారం. దీనికి కూడా న్యాయపరమైన చిక్కులు లేకుండా పరిశీలిస్తున్నారు. ఇదివరకు కనకరాజు నియామకం కోసం.. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆపై స్థాయి అధికారి బదులు హైకోర్టు రిటైర్డ్ జడ్జీని అని నిబంధన విధించారు. దీనిని నిమ్మగడ్డ తప్పుపట్టి.. హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు జారీచేసిన ఆర్డినెన్స్, కనకరాజ్ నియామకం చెల్లదని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తున్నందన.. ఒకవేళ తమకు అనుకూలంగా తీర్పు వేస్తే.. మరో ఆర్డినెన్స్ జారీచేసి మన్మోహన్ సింగ్‌ను కొత్త కమిషనర్‌గా నియమించడం ఖాయమని.. ప్రభుత్వ చర్యలను బట్టి అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications