ఏపీలో ఈసారి పెన్షన్లు ఇచ్చే టైమ్ ఇదే..! సర్కార్ మరో అప్డేట్..!

దేశవ్యాప్తంగా ఈ నెలాఖరులో మూడు రోజుల బ్యాంకుల సమ్మె కారణంగా ఏపీలో ఈసారి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ (AP NTR Bharosa Pension) పథకం కింద ఇచ్చే పింఛన్లు ఆలస్యం కాబోతున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాజాగా ప్రకటన చేశారు. అయితే ఇందులో మధ్యాహ్నం నుంచి పెన్షన్ల పంపిణీ ఉంటుందని ఆయన తెలిపారు. ఇవాళ దీనిపై మరింత స్పష్టత ఇస్తూ, అక్టోబర్ 1న ఎప్పటి నుంచి పెన్షన్ల పంపిణీ ఉంటుందో ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

ఏపీలో పెన్షనర్లకు సర్కార్ గుడ్ న్యూస్- అదనపు పెన్షన్ పెంపు-జీవో జారీ..!
ఏపీలో పెన్షనర్లకు సర్కార్ గుడ్ న్యూస్- అదనపు పెన్షన్ పెంపు-జీవో జారీ..!

బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ సమయం మారినట్లు అధికారికంగా ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అక్టోబర్‌ 1న పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా పెన్షన్ల నగదు ఉపసంహరణ, పంపిణీ షెడ్యూల్‌లో మార్పులు చేశారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు బ్యాంకు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, పెన్షన్ల సజావుగా పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని బ్యాంకింగ్ అధికారులు సూచించారు.

AP NTR Bharosa Pension Disbursal Timing Changed to October 1 From 12 Noon
ఏపీలో పింఛన్ దారులకు అలర్ట్..! బ్యాంకుల సమ్మె కారణంగా ఈసారి..!
ఏపీలో పింఛన్ దారులకు అలర్ట్..! బ్యాంకుల సమ్మె కారణంగా ఈసారి..!

దీంతో సెప్టెంబర్ 2026కు చెల్లించాల్సిన పెన్షన్ల నగదును అక్టోబర్ 1 ఉదయం ఉపసంహరించుకోవాలని, అయితే పెన్షన్ల పంపిణీని అక్టోబర్ 1 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభించాలని సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.కరుణ వాకాటి ఆదేశాలు జారీ చేశారు. ఈ మార్పులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ/వార్డు సచివాలయాల పెన్షన్ పంపిణీ సిబ్బందికి సూచించారు. అలాగే, మారిన పెన్షన్ పంపిణీ సమయంపై పెన్షన్ లబ్ధిదారులకు విస్తృతంగా సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.

AP NTR Bharosa Pension Disbursal Timing Changed to October 1 From 12 Noon

సెప్టెంబర్ 26వ తేదీ శనివారం బ్యాంకు సెలవు కావడం, అలాగే సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఉన్న నేపథ్యంలో పింఛను దారులకు ఎలాంటి అవస్థలు కలగకుండా ప్రభుత్వం ముందస్తుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన‌ట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు అక్టోబర్ 1వ తేదీ ఉదయమే పింఛన్ల పంపిణీకి అవసరమైన నగదును విత్‌డ్రా చేసుకునేలా బ్యాంకులను అందుబాటులో ఉంచాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ ఆదేశాలకు కొనసాగింపుగా ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+