ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల- 3 దశల్లో పోలింగ్, ఫలితాలు ఇలా..!

ఏపీలో పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections) షెడ్యూల్ విడుదలైంది. ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు 3 దశల పోలింగ్ షెడ్యూల్ ను విడుదల చేసింది. దీని ప్రకారం మూడు దశల్లో జరిగే ఎన్నికల నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణలు, పోలింగ్ తేదీలు, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి.. ఇలా అన్ని వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ప్రకటించారు. ఈ ఎన్నికలకు భారీ భద్రత కల్పిస్తామని ఆయన తెలిపారు.

పవన్ విడాకులపై పోస్టులు..! ఇద్దరు అరెస్ట్, 42 మందికి నోటీసులు..!
పవన్ విడాకులపై పోస్టులు..! ఇద్దరు అరెస్ట్, 42 మందికి నోటీసులు..!

రాష్ట్రంలో మూడు విడతలుగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలి దశకు రేపు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎస్ఈసీ వెల్లడించారు. తొలి దశలో పంచాయతీ ఎన్నికలకు 26వ తేదీన పోలింగ్ చేపట్టి, అదే రోజున ఫలితాలు ప్రకటిస్తామన్నారు. రెండో దశ పంచాయతీ ఎన్నికలకు 29వ తేదీన పోలింగ్ చేపట్టి అదే రోజు ఫలితాలు విడుదల చేయనున్నారు. అలాగే మూడో దశ పంచాయతీ ఎన్నికలకు డిసెంబర్ 2వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.

AP Panchayat Elections State Election Commission Announces Three-Phase Poll Schedule
ఏపీలో 23 చోట్ల మున్సిపల్ పోరు-ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల..!
ఏపీలో 23 చోట్ల మున్సిపల్ పోరు-ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల..!

సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలకు కూడా నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్ఈసీ తెలిపారు. పట్టణ స్దానిక సంస్ధల పరిధిలో ఈరోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని,
అభ్యర్ధులతో నామినేషన్లు స్వేచ్ఛగా దాఖలు చేయించే బాధ్యత పూర్తిగా జిల్లా యంత్రాంగానిదే అని ఎస్ఈసీ తెలిపారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు నుంచి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన గుర్తుచేశారు.

పోలింగ్ కేంద్రాల నుంచి కౌంటింగ్ సెంటర్ల వరకు, భద్రత కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మరోవైపు గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసపై స్పందించిన ఎస్ఈసీ.. పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో ఎస్పీలతో 14వ తేదీన సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే విశాఖలో ఓట్ల పెరుగుదల వివాదంపై స్పందిస్తూ.. పోలింగ్ స్టేషన వారిగా ఓటింగ్ వివరాలు వెల్లడించినట్లు తెలిపారు. సరైన ఓట్లను పరిశీలించి తుది ఓటింగ్ శాతాలు ప్రకటించామన్నారు. అలాగే గత స్థానిక సంస్థల ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెరిగిందని ఎస్ఈసీ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+