సీఎం జగన్ చెప్పినా స్పందించని మోడీ!
ప్రధానమంత్రి నరేంద్రమోడీ బహిరంగసభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీగా జనసమీకరణ చేసి ఆంధ్రా విశ్వవిద్యాలయంలో బహిరంగసభ నిర్వహించింది. ఈ సందర్భంగా మోడీ తన ప్రభుత్వ పనితీరును, చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. తర్వాత ముఖ్యమంత్రి జగన్ విశాఖ ఉక్కు, రైల్వే జోన్ అంశాలను ప్రస్తావించారు.
రాష్ట్రానికి కేంద్రం తరఫున సహాయ సహకారాలను అందించి ఆశీర్వదించాలని వేదికపైనే ప్రధానమంత్రికి ప్రత్యేకంగా నమస్కారం చేసి విజ్ఞప్తి చేశారు ప్రధానమంత్రిని పలుమార్లు సార్.. సార్.. సార్.. అంటూ సంభోదించి వినయపూర్వకంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రస్తావించారు. కేంద్రం ఇవ్వాల్సినవాటిని మరోమారు గుర్తుచేశారు. తెలుగు ప్రజల కోసం ఒక ముఖ్యమంత్రి వినయంగా సార్.. సార్.. అని సంబోధిస్తూ విభజనతో దగా పడ్డ ఏపీకి న్యాయం చేయాలంటూ పదే పదే వేడుకున్నారు.

ముఖ్యమంత్రి ఎంత వేడుకున్నప్పటికీ ప్రధానమంత్రి మాత్రం ఏపీకికానీ, విశాఖపట్నానికి కానీ ఎటువంటి వరాలు కురిపించలేదు. ఏపీకి సానుకూలంగా ఏదైనా ప్రకటన చేసినా ప్రభుత్వానికి కూడా ఉపయోగపడుతుందనుకున్నప్పటికీ నిరాశే ఎదురైంది.
ఎన్నో ప్రాణాలను పణంగా పెట్టి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణపై సానుకూలంగా స్పందిస్తారేమోనని కార్మికులు, ఉద్యోగులు ఆశగా ఎదురు చూశారు. తెలుగు ప్రజలు తెలివిగలవారంటూ, కలుపుగోలు తనంతో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారంటూ అన్యాపదేశంగా కొనియాడారేకానీ చేతల్లో ఏపీకి ఏదీ ప్రకటించలేకపోయిన ప్రధానమంత్రి వైఖరిపై విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించిన ఉద్యోగులు నిరాశను వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications