నిత్యావసరాల కోసం పట్టణవాసుల నరకం ... ఏపీ ప్రభుత్వ కఠిన నిబంధనలే కారణం
ఏపీలో ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు సామాన్యులకు తిప్పలు తెచ్చి పెడుతుంది. నిత్యావసరాల కోసం వెళ్ళినా సామాజిక దూరం పాటించాల్సిన పరిస్థితి . మాల్స్ కి వెళ్ళినా మినిమం రెండు మూడు గంటలు ఈజీగా పడుతున్న పరిస్థితిలో ఏపీలో కర్ఫ్యూ సడలింపు కుదింపు సామాన్యులను చాలా ఇబ్బంది పెడుతుంది.

ఏపీ ప్రభుత్వ కఠిన నిర్ణయాలతో ప్రజల తిప్పలు
కరోనా వైరస్ దేశంలో తీవ్రంగా మారుతున్న నేపధ్యంలో ఏపీ షట్ డౌన్ చేశారు .లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత కూడా ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ పోతున్నాయి. ఇక ఈ నేపధ్యంలో ప్రజలు సామాజిక దూరం పాటించటం లేదని భావించిన ఏపీ సర్కార్ కఠిన నిర్ణయం తీసుకుంది . ఇప్పటికే ఏపీలో లాక్ డౌన్ సందర్భంగా కర్ఫ్యూ అమలవుతుంది. ఇక ఆ కర్ఫ్యూలో ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిత్యావసరాల కొనుగోలు కోసం ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. కానీ ప్రజలు సామాజిక దూరం పాటించకపోవటంతో కర్ఫ్యూ సడలింపు కుదించారు . కేవలం 11 గంటల వరకే పట్టణాల్లో పరిమితం చెయ్యటం ప్రజలకు ఇబ్బందిగా మారింది .

షాపింగ్ మాల్స్ వద్ద క్యూ లైన్ లు .. సామాజిక దూరంతో షాపింగ్ ఆలస్యం
ఇక ఇదే ఏపీ వాసులకు తిప్పలు తెచ్చి పెడుతుంది. నిత్యావసరాలను తెచ్చుకునేందుకు కూడా వీలు కాని పరిస్థితి తెచ్చి పెట్టింది . పట్టణాల్లో నిత్యావసరాల కోసం ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకే కొనుగోలు చెయ్యాలని చెప్పటంతో ప్రజలు ఆ సమయంలో మార్కెట్ ల వద్దకు వెళ్ళటంతో రద్దీ నెలకొంది. ఇక ఇదే సమయంలో మార్కెట్ ల వద్ద , కిరాణా సామాను తెచ్చుకునేందుకు వెళ్ళిన షాపుల వద్ద సామాజిక దూరం పాటించాల్సి రావటం , కొంత మందినే లోనికి అనుమతించటం వంటి చర్యలతో ఒక గంటలో అయిపోవాల్సిన షాపింగ్ కాస్తా రెండు, మూడు గంటల పాటు పడుతుంది . దీంతో నరకం చూస్తున్నారు ప్రజలు . ఈ లైన్లలో నిలబడటం మా వల్ల కాదని గగ్గోలు పెడుతున్నారు.

సరుకుల కోసం వచ్చినా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన
ఇక ఇదే సమయంలో రోడ్ల మీదకు వస్తే పోలీసుల ఇబ్బంది బాగా పెరిగిపోయిందని లబోదిబోమంటున్నారు. పనుల్లేక , పైసలు లేక , పస్తులు ఉండలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు ప్రభుత్వ కఠిన నిబంధనలతో మరింత ఇబ్బందికి గురవుతున్నారు. కేసులు పెరుగుతున్నాయని , ప్రజలు రోడ్ల మీదకు రాకుండా కంట్రోల్ చెయ్యటం కష్టంగా మారుతుందని భావిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సర్కార్ ఇంటింటికీ మొబైల్ సేవలు అందిస్తామని చెప్పినా అవి అన్ని చోట్ల అందుబాటులో లేవు.
Recommended Video

కుదించిన సమయంలో నిత్యావసరాల కొనుగోలు కష్టం అంటున్న ప్రజలు
విపరీతంగా పెంచి అమ్ముతున్న ధరలతో బయట కొనుగోలు అంటే భయపడుతున్నారు. కొన్ని మార్ట్ లలో, మాల్స్ లలో మాత్రం కాస్త ధరలు అందుబాటులో ఉన్న నేపధ్యంలో అక్కడికి వెళ్ళటానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇక ప్రభుత్వం సమయం తక్కువ చేసి నిత్యావసరాలు కొనుగోలు చెయ్యమంటే షాపింగ్ మాల్స్ , మార్ట్ ల దగ్గర పరిస్థితి వేరేలా ఉంది . దీంతో ఇవెక్కడి తిప్పలురా బాబూ అంటూ తెగ బాధ పడుతున్నారు. కరోనా వైరస్ మహమ్మారి ఎప్పటికి వదులుతుందో అని తెగ ఫీల్ అవుతున్నారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications