ట్యాపింగ్: ఏపీ పోలీస్ సీరియస్, ఆధారాలుంటే కేసీఆర్‌‌పై కేసుకు సిద్ధం?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మరికొందరి ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఏపీ పోలీసు శాఖ తీవ్రంగా పరిగణనిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆధారాలుంటే కేసీఆర్ పైనా కేసుకు సిద్ధం అన్నట్లుగా ఏపీ పోలీసు శాఖ ఉన్నట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ గురించి సమాచారం సేకరిస్తోందని తెలుస్తోంది.

దీనిపై ఏపీ డీజీపీ రాముడు విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. తద్వారా ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం ఏపీ, తెలంగాణల మధ్య పెనువివాదంగా మారేలా కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి.

ఉమ్మడి రాజధాని హైదరాబాదులో తెలంగాణ పోలీసులు ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారన్న సమాచారాన్ని సేకరించడంలో ప్రస్తుతం ఏపీ పోలీసు వర్గాలు నిమగ్నమయ్యాయని వార్తలు వస్తున్నాయి.

 AP Police serious on tapping of Chandrababu 's phone

ఆధారాలు దొరికితే, అవసరమైతే కేసీఆర్ పైన కేసు నమోదుకు కూడా వెనుకాడరాదని ఏపీ పోలీసు వర్గాలు భావిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోందని వార్తలు వస్తున్నాయి.

ఫోన్ ట్యాపింగ్ వివాదంలో కొన్నేళ్ల క్రితం కర్నాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే తన పదవికి రాజీనామా చేయడానికి దారితీసిన సమాచారాన్ని కూడా తెప్పిస్తున్నారంటున్నారు. చంద్రబాబు ఫోన్లలో ఎవరెవరితో, ఏమేం మాట్లాడారో ఆ సమాచారమంతా ఉందన్న కోణంలో తెరాస నేతలు చేస్తున్న ప్రకటనలు తెలిసింది. ఫోన్ల ట్యాపింగ్ పైన స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+