రూటు మారిన ఏపి రాజ‌కీయం..! స్థాయి మ‌ర‌చి వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు..!!

నిన్న‌టి వ‌ర‌కు అవిశ్వాస తీర్మ‌నం, పార్ల‌మెంట్ అంటూ ఢిల్లీ చుట్టూ తిరిగిని ఆంద్ర ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ఒక్క సారిగా సొంత‌రాష్ట్రంలో లాండ్ అయ్యాయి. ఏపి సీయం చంద్ర‌బాబుకు కాస్త విశ్రాంతి ఇచ్చిన ప్ర‌తిప‌క్ష పార్టీనేత జ‌గ‌న్, జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పైన అవాకులు,చ‌వాకులు పేల్చారు. ఇన్నాళ్లూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరును కూడా ప్ర‌స్థావించ‌ని జ‌గ‌న్ ఏకంగా వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌ల‌ను చేసారు. దీంతో రెచ్చిపోయిన ప‌వ‌న్ ఫాన్స్ అంతే స్థాయిలో జ‌గ‌న్ కుటుంబాన్ని టార్గెట్ చేసారు. రాజ‌కీయాల్లో వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌ల‌కు పాల్పడితే త‌ల ఎంత‌లా బొప్పి క‌డుతుందో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప్ర‌త్య‌క్షంగా చూపించారు జ‌న‌సైనికులు.

దిగ‌జారుతున్న నైతిక‌విలువ‌లు.. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు ఎంత‌వ‌ర‌కు సంమంజ‌సం..

దిగ‌జారుతున్న నైతిక‌విలువ‌లు.. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు ఎంత‌వ‌ర‌కు సంమంజ‌సం..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల రూటు మారుతోంది. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌తో వాడివేడిగా మారుతున్నాయి ఏపి రాజ‌కీయాలు. ఇంత కాలం అందరి దాడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ఉండగా, ఇప్పుడు రాజకీయం అంతా జగన్ వర్సెస్ పవన్ గా మారింది. అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డి ఎవరూ ఊహించని రీతిలో పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారని, కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తారని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో జనసేన అభిమానులు సోషల్ మీడియా వేదికగా అటు జగన్ పై , జగన్ కుటుంబ సభ్యులపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా నిండా ఇదే రచ్చ సాగుతోంది. జగన్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. దోపిడీలు చేసేవాళ్ళు, కుంభకోణాలు చేసేవాళ్ళకే అంత ధైర్యం ఉండే, నీతి నిజాయితీగా ఉన్న తనకెంత ధైర్యం ఉండాలని ప్రశ్నించారు.

చ‌ర్య‌కు ప్ర‌తి చ‌ర్య‌.. జ‌గ‌న్ కు గ‌ట్టి స‌మాధానం ఇచ్చిన ప‌వ‌న్..

చ‌ర్య‌కు ప్ర‌తి చ‌ర్య‌.. జ‌గ‌న్ కు గ‌ట్టి స‌మాధానం ఇచ్చిన ప‌వ‌న్..

పేరు పెట్టకుండా జగన్ ను ఉద్దేశించి ఫ్యాక్షనిస్టులు, గూండాలు నోటికొచ్చినట్లు మాట్లాడితే ఉప్పెనలా దాడిచేస్తామని పవన్ హెచ్చరించారు . విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయం చేయ‌డానికి వ‌చ్చాననీ, ఎలాంటి భాష ఉపయోగించాలో తెలిసినవాడినని చెప్పారు. తాను వ్య‌క్తిగ‌తంగా మాట్లాడం మొద‌లుపెడితే ఫ్యాక్షనిస్టు నాయకులు త‌ట్టుకోలేర‌ని అన్నారు. అయితే అలాంటి మాటలతో స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌ని అన్నారు. ఇసుక మాఫియా, కుంభ‌కోణాలు, దోపిడీలు చేసే వీళ్ల‌కే పిచ్చిపిచ్చిగా మాట్లాడే తెగింపు ఉంటే.. ప్ర‌జా సంక్షేమం కోసం నిల‌బ‌డే త‌న‌కు ఎంత తెగింపు ఉండాలని ప‌వ‌న్ ఘాటుగా స్పందించారు.

జ‌వాబుదారిత‌నం కోస‌మే రాజ‌కీయాల్లోకి.. జ‌గ‌న్ లా దోచుకోవ‌డానికి కాద‌న్న ప‌వ‌న్..

జ‌వాబుదారిత‌నం కోస‌మే రాజ‌కీయాల్లోకి.. జ‌గ‌న్ లా దోచుకోవ‌డానికి కాద‌న్న ప‌వ‌న్..

స‌మాజంలో మార్పు తీసుకొస్తున్నాన‌నే భ‌యంతోనే తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ అంద‌రూ న‌న్ను తిడుతున్నారని, తాను ఒంటిస్తంభం మేడలో కూర్చొనే వ్య‌క్తి కాదని. నేల మీద న‌డిచే వ్య‌క్తి అని గుర్తుంచుకోవాలని గుర్తు చేసారు. క‌నుమ‌రుగైన మాన‌వ‌త్వాన్ని. జ‌వాబుదారిత‌నాన్ని రాజ‌కీయాల్లో తీసుకురావడానికే జ‌న‌సేన పార్టీ పెట్టాన‌ని తెలిపారు. రాజ‌కీయాల‌కు వేల‌కోట్లు, గూండాలు అవసరం లేదని. ఆశ‌యం కోసం తెగించే గుణం ఉంటే చాలని., జ‌న‌సేన అటువంటి ఆశ‌యంతో ప్రజా శ్రేయస్సు కోసం పోరాటం చేస్తోందని పేర్కొన్నారు.

ముఖ్య‌మంత్రి ప‌దవి క‌న్నా సామాజిక మార్పు అవ‌స‌నరం అంటున్న ప‌వ‌న్..

ముఖ్య‌మంత్రి ప‌దవి క‌న్నా సామాజిక మార్పు అవ‌స‌నరం అంటున్న ప‌వ‌న్..

రాజ‌కీయాల‌కు బ‌ల‌మైన క్ర‌మ‌శిక్ష‌ణ‌, ఓపిక కావాలని. ప్ర‌తి జ‌న‌ సైనికుడు వాటిని అల‌వ‌ర్చుకోవాలని ప‌వ‌న్ పిలుపునిచ్చారు. ఒక త‌రంలో మార్పు రావాలంటే 25 ఏళ్లు ప‌డుతుందని తాను అందుకే 25 ఏళ్లు రాజ‌కీయాలు చేయ‌డానికి వచ్చానని చెబుతున్న ప‌వ‌న్., 5 ఏళ్లు గ‌ట్టిగా క‌ష్ట‌బ‌డితే ముఖ్య‌మంత్రి మంత్రి సీటులో కూర్చొవ‌చ్చు కానీ దానివ‌ల్ల స‌మాజంలో మార్పు రాదని అన్నారు. ఒక సామాజిక మార్పు తెచ్చేందుకు మరింత ప్రణాళికతో ముందుకు వెళ్ళాలన్నారు ప‌వ‌న్. జగన్ విమర్శలు, ప‌వన్ కళ్యాణ్ కౌంటర్ లకు తోడు సోషల్ మీడియాలో మాత్రం రెండు పార్టీలకు చెందిన వారు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+