జగన్-పెదరాయుడుల మధ్య భారీ గ్యాప్..రంగంలోకి మధ్యవర్తులు, మారుతున్న సమీకరణాలు
విజయవాడ: ముఖ్యమంత్రి జగన్‌తో పెద్ద రాయుడికి చెడిందా.. ? వీరిద్దరి మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయి...? మధ్యవర్తుల ద్వారా మంతనాలు జరపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? జగన్‌కు సైతం మోహన్ బాబు దూరమైనట్లేనా.. ? ఇప్పుడిదే పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్. 2019 ఎన్నికల ముందు అధికారికంగా వైసీపీలో చేరిన నటుడు మోహన్‌బాబు ప్రస్తుతం ముఖ్యమంత్రితో దూరం పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. కొద్ది నెలల క్రితం కుటుంబ సభ్యులతో సహా ప్రధాని మోడీ, అమిత్ షాను కలిసిన సమయంలో ఆయన బీజేపీలో చేరడం ఖాయమనే ప్రచారం జరిగింది. కానీ ఆ సందర్భంలో సైతం మోహన్‌బాబు ముఖ్యమంత్రి జగన్‌కు మద్దతుగానే మాట్లాడారు. అయినా నాటి నుంచీ నేటి వరకు సీఎంను మాత్రం నేరుగా కలవలేదు. తాజాగా ఓ కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. దీనిపైనే మోహన్‌బాబు ముఖ్యమంత్రిల నడుమ కొంతమంది మధ్యవర్తులు చర్చలు జరుపుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మోహన్‌బాబే ఓ ప్రముఖ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆందోళన
ఉమ్మడి ఏపీకి వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి మోహన్‌బాబు కుటుంబం దగ్గరగా ఉండేది. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా మోహన్‌బాబు పనిచేసినా చంద్రబాబుతో మాత్రం తొలినుంచీ దూరంగానే ఉన్నారు. మోహన్‌బాబు వైయస్ సమీప బంధువులతోనే వియ్యం అందుకున్నారు. వైయస్ మరణం తర్వాత నుంచి జగన్‌తో సన్నిహితంగా ఉంటున్నారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి జగన్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.

కలెక్షన్ కింగ్- జగన్‌లకు మధ్య భారీ గ్యాప్
జగన్ సీఎం అయితే మోహన్‌బాబు ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ లేదా టీటీడీ ఛైర్మెన్ అవుతారని వైసీపీలో జోరుగా ప్రచారం జరిగింది. మోహన్ బాబు సైతం తనకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని ఆశించారు. ఆ రెండు పదవులు దక్కకపోవడంతో ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి మోహన్‌బాబును రాజ్యసభకు పంపుతారని అంచనాలు వ్యక్తమయ్యాయి. చివరి నిమిషం వరకు మోహన్ బాబు సైతం ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆశాభంగం తప్పలేదు. మోహన్ బాబు మాత్రం తాను జగన్ సీఎం కావాలని కోరుకున్నానని అంతకుమించి తానేమీ ఆశించడం లేదంటూ ఆచి తూచి స్పందించారు. ఇంత సడెన్‌గా మోహన్‌బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని, హోంమంత్రి అమిత్ షాను కలవడంతో జగన్-మోహన్‌బాబుల రిలేషన్స్ పై కొత్త సందేహాలు మొదలయ్యాయి. అప్పుడు మొదలైన గ్యాప్ ఇప్పుడు మరో అంశంలో తీవ్రరూపం దాల్చింది.

జగన్‌ను కొందరు రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి తన విద్యా సంస్థలకు సంబంధించిన ఫీజు రీఇంబర్స్‌మెంట్ బకాయిల కోసం ఆందోళన చేస్తూనే ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ధర్నా చేసి ప్రభుత్వ తీరును తప్పు బట్టారు. అయితే తాజాగా మోహన్‌బాబు ఒక టీవీ ఛానెల్‌లో తొలిసారిగా జగన్ ప్రభుత్వంపై తన అసంతృప్తిని బయటపెట్టారు. ఫీజు రీఇంబర్స్‌మెంట్ సమస్య ఇంకా తీరలేదని తేల్చి చెప్పారు. కొందరు అధికారులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారని కొత్త వాదన తెరమీదకు తెచ్చారు.

కమలం పార్టీలో చేరాలనే ఆలోచనలో ఉన్నారా..?
అమరావతి విషయంలోను మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. చిరంజీవి ముఖ్యమంత్రి మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించగా మోహన్‌బాబు మాత్రం తాను సరైన సమయంలోనే రాజధాని అంశంపై స్పందిస్తానని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఫీజు రీఇంబర్స్‌మెంట్ అంశంపై కొంతమంది మాట్లాడుతున్నారని చెప్పడం ద్వారా మోహన్‌బాబు జగన్ మధ్య గ్యాప్ ఏర్పడిందనే విషయాన్ని ఆయన పరోక్షంగా స్పష్టం చేసినట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో తాను బీజేపీలో చేరే అంశంపై తర్వాత సమాధానం చెబుతానని వ్యాఖ్యానించడం ద్వారా ఆయన కమలం పార్టీలో చేరాలనే ఆలోచనలో ఇంకా ఉన్నారనే విషయం స్పష్టం అవుతోంది.
Recommended Video

మోహన్‌బాబును బుజ్జగించే ప్రయత్నం జగన్ చేయడం లేదా..?
ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇప్పటివరకు మోహన్‌బాబు సీఎం జగన్‌ను కలవలేదు. ఇప్పుడు పెదరాయుడు చేసిన తాజా వ్యాఖ్యలతో ఆయన జగన్‌తో సఖ్యతగా లేరనే విషయం స్పష్టం కావడంతో సహా బీజేపీవైపు అడుగులేస్తున్నారనే అంశం కూడా క్లియర్‌గా కనిపిస్తోంది. ఇదే సమయంలో తనకు ఎన్నికల్లో అండగా నిలిచిన మోహన్‌బాబును బుజ్జగించేందుకు ముఖ్యమంత్రి సైతం సుముఖంగా లేరనేది పార్టీనేతల అభిప్రాయం. మరోవైపు జగన్-మోహన్‌బాబుల మధ్య గ్యాప్ రాకుండా చర్చలు జరిపేందుకు చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు ముఖ్యులు రంగంలోకి దిగినట్లు సమాచారం.
-
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications