సీఎం జగన్ మాస్టర్ ప్లాన్: ఉద్యోగుల ఓట్లపై ధీమా అదే : టీడీపీ వ్యూహానికి కౌంటర్..!!
ఏపీలో ఉద్యోగులు సీఎం జగన్ కు దూరమయ్యారా. తాజా చర్చలతో తీసుకున్న సర్దుబాటు - దిద్దుబాటు నిర్ణయాలతో తిరిగి దగ్గరయ్యారా. ఇప్పుడు ఏపీలో రాజకీయంగా సాగుతున్న బిగ్ డిబేట్ ఇది. 2019 ఎన్నికల ముందు ఉద్యోగులకు మద్దతుగా సీఎం జగన్ అనేక హామీలు ఇచ్చారు. సీపీఎస్ రద్దుతో పాటుగా.. అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్ ఇస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 27 శాతం ఐఆర్ ప్రకటించి..అమలు చేస్తున్నారు. అయితే, పీఆర్సీ ప్రకటన సమయంలోనూ..తరువాత కారణం ఎవరైనా..సలహాలు ఎవరివైనా..సీఎం జగన్ పైన ఉద్యోగుల్లో ఒక్కసారిగా ఆగ్రహం బయటకు వచ్చింది. ప్రభుత్వం ఆంక్షలు పెట్టినా... ఛలో విజయవాడ విజయవంతం అయింది. ఉద్యోగుల్లో ప్రభుత్వం పైన ఏ స్థాయిలో ఆగ్రహం ఉందో అర్దమైపోయింది. వెంటనే సీఎం జగన్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు.
Recommended Video

ఉద్యోగుల్లో అసంతృప్తి తగ్గించేలా
పీఆర్సీ 23 శాతం మినహా... ప్రధానంగా ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హెచ్ఆర్ఏ...అడిషనల్‌క్వాంటమ్‌పెన్షన్ విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. పీఆర్సీ రికవరీ లేదని తేల్చి చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలను మంత్రుల సుదీర్ఘ చర్చలతో ఒప్పించారు. ఉద్యోగ సంఘాల నేతలు పోటీ పడి సీఎం పైన ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో తాజా చర్చలు... ఒప్పందాలు పైన ఉపాధ్యాయ సంఘాలు ..ఇతర సంఘాల నేతలు కొందరు విభేదిస్తున్నారు. ఆందోళన కొనసాగింపుకు నిర్ణయించారు. ఉద్యోగ సంఘాల నేతల పైనా ఉద్యోగుల్లో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. అయితే, ప్రభుత్వం ముందుగా సమ్మె విరమణ కోసమే ప్రాధాన్యత ఇచ్చింది. అందులో సక్సెస్ అయింది. అదే సమయంలో ఉద్యోగుల్లో మొదలైన అసంతృప్తి అంత త్వరగా పోదనే అంచనాకు సీఎం వచ్చినట్లుగా చెబుతున్నారు.

అన్ని మార్గాలపైనా అన్వేషణ
అందులో భాగంగా.. ఉద్యోగులు చేస్తున్న ఒక ప్రధానమైన డిమాండ్ ను ఆమోదించి వారికి ఊరట నివ్వటంతో పాటుగా.. తనకు అనుకూలంగా మలచుకొనే విధంగా జగన్ ప్రభుత్వం పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అదే...అయిదేళ్లకే పీఆర్సీ అమలు నిర్ణయం. గతంలోనూ ఇదే విధానం ఉన్నా..ఈ సారి మాత్రం తొలుత కేంద్రం తరహాలో పదేళ్లకోసారి పీఆర్సీ అమలుకు నిర్ణయించి.. ఇప్పుడు మరలా అయిదేళ్ల కే పీఆర్సీ అమలు నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా 12వ పీఆర్సీ 2024 ఎన్నికల లోగానే ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం పీఆర్సీ కమీషన్ నియమాకం అయినా ఖచ్చితంగా నియమాకం చేయాల్సి ఉంటుందని ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో.. సీఎం జగన్ ఇప్పటికే హామీ ఇచ్చిన విధంగా సీపీఎస్ విషయంలో సానుకూల నిర్ణయం దిశగా అవకాశం ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు.

టీడీపీ ఛాన్స్ లేకుండా చేయాలనే
దీంతో పాటుగా.. ఖాళీల భర్తీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక, వీటితో పాటుగా ఉద్యోగులను తన వైపు తిప్పుకొనేందుకు వారికి అందుతున్న వేతనాలు తక్కువగా ఉన్నాయనే భావన తొలిగించేందుకు 2024 ఎన్నికలకు ముందే 12వ పీఆర్సీ కమిటీ నియమాకం.. ఆ తరువాత ఐఆర్ మరోసారి ఇవ్వాలనేది వ్యూహంగా తెలుస్తోంది. దీని ద్వారా జగన్ తిరిగి అధికారంలోకి వస్తేనే...ఉద్యోగులకు మేలు జరుగుతుందనే విధంగా నిర్ణయాల పైన ప్రత్యేకంగా ఉద్యోగాలు..వారి కుటుంబాలను ఆకర్షించే నిర్ణయాల పైన కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. తాజాగా, ఉద్యోగ సంఘాల నేతలు కలిసిన సమయంలోనూ జగన్ ఇదే రకమైన సంకేతాలు ఇచ్చారు. జగన్ చేసినట్లుగా ఎవరి హాయంలోనే ఉద్యోగులకు.. పెన్షనర్లకు మేలు జరగలేదనే విధంగా నిర్ణయాలు ఉంటాయని వ్యాఖ్యానించారు.

కొత్త పీఆర్సీ..పెన్షనర్లకు మేలు పైన ఫోకస్
పెన్షనర్లకు మరింత ప్రయోజనం కలిగే విధంగా నిర్ణయాల దిశగా కసరత్తు చేయాలని ఇప్పటికే సీఎం జగన్ అధికారులకు సూచించినట్లుగా తెలుస్తోంది. దీని ద్వారా..ఇప్పుడు ఎగిసిపడిన అసంతృప్తిని పూర్తిగా పోగొట్టి.. మరింత పాజిటివ్ గా మార్చుకొనే విధంగా జగన్ మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో..ఇప్పుడు ఉద్యోగుల్లో వ్యతిరేకత మొదలైందని...తమకు అనుకూలంగా మలచుకోవాలని టీడీపీ భారీ ఆశలతో అడుగులు వేసింది. ఉద్యోగుల ఆందోళనకు మద్దతు ప్రకటించింది. కానీ, టీడీపీ వ్యూహానికి కౌంటర్ ఇచ్చేలా.. ఉద్యోగులను పూర్తిగా తనకే అనుకూలంగా మారేలా జగన్ అమలు చేస్తున్న మాస్టర్ ప్లాన్ ఎంత వరకు కలిసి వస్తుంది.. ఏ విధంగా అమలు చేస్తారనేది రానున్న రోజుల్లో స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications