వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి చెక్- హైకోర్టు కీలక ఉత్తర్వులు

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు చేస్తున్న దోపిడీకి చెక్‌ పెడుతూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ముఖ్యంగా ప్రభుత్వ మార్గదర్శకాలను సైతం లెక్కచేయకుండా రోగులను ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తున్న ఆస్పత్రులకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు కానుంది. ఇకపై ప్రభుత్వం నిర్దేశించిన బిల్లులు కాకుండా ఎక్కువగా వసూలు చేయాలంటే భయపడేలా రాష్ట్ర ఉన్నత న్యాయస్ధానం తీర్పు వెలువరించింది.

కరోనా పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ

కరోనా పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ

ఏపీలో కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులు ఎంత వసూలు చేయాలన్న దానిపై ప్రభుత్వం ఇప్పటికే స్ఫష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే కరోనా చికిత్స చేసేందుకు ప్రత్యేకంగా ఆస్పత్రులకు అనుమతులు కూడా మంజూరు చేసింది. అయినా ఇప్పటికీ రాష్ట్రంలో విజిలెన్స్‌, టాస్క్‌ఫోర్స్‌ నిర్వహిస్తున్న దాడుల్లో అనుమతుల్లేని ఆస్పత్రులు, భారీగా బిల్లులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై భారీ జరిమానాలు, క్రిమినల్ కేసులు పడుతూనే ఉన్నాయి.

ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి హైకోర్టు చెక్‌

ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి హైకోర్టు చెక్‌


ఏపీలో కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి చెక్‌ పెట్టేలా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం ఇకపై ప్రైవేటు ఆస్పత్రులు రోగులకు చికిత్స తర్వాత బిల్లులు ఇచ్చేముందు వాటిపై ప్రభుత్వం నియమించిన నోడల్‌ అధికారి సంతకం తప్పనిసరి. నోడల్‌ అధికారి ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జీలకు అనుగుణంగా బిల్లులు ఉన్నాయో లేదో సరిచూసి బిల్లులపై సంతకం చేయాల్సి ఉంటుంది. అప్పుడే సదరు బిల్లుల్ని ఆస్పత్రులు రోగులకు ఇవ్వాల్సి ఉంటుంది. అఖిల భారత న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యాన్ని విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Recommended Video

Chandrababu Naidu CM అవ్వాలంటే | Ys Jagan సక్సెస్ మంత్రా ! || Oneindia Telugu
ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్స ఖర్చుల డిస్‌ప్లే

ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్స ఖర్చుల డిస్‌ప్లే

ఇకపై ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్సకు సంబంధించి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను ఆయా ఆస్పత్రులు కచ్చితంగా బోర్డులు పెట్టాల్సి ఉంటుంది. ఆయా బోర్డులపై చికిత్సకు తీసుకుంటున్న ఖర్చు, ఇతర ఛార్జీలను డిస్‌ప్లే చేయాల్సి ఉంటుంది. వాటికి అనుగుణంగానే ఛార్జీలు వసూలు చేయాల్సి ఉంటుంది. వీటిని తనిఖీ చేసి హైకోర్టు ఆదేశాలు అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్‌, జాయింట్ కలెక్టర్‌, డీఎంహెచ్‌వోపై ఉంటుందని పేర్కొంది. ఇందులో విఫలమైతే అందరిపైనా చర్యలు తప్పవని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.

English summary
andhrapradesh high court on today issued key orders on covid 19 treatment bills in private hospitals in the state. the court orders nodal officer signature is must before giving covid treatment bills to patients, which assures the charges are in accordance with govt guidelines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X