Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

AP rain alert: ఆ జిల్లాల్లో భారీవర్షాలు; పోలవరం, ధవళేశ్వరంలో గోదావరి ఉధృతి ఇలా!!

ఒకపక్క తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు మూడు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణాజిల్లా, గుంటూరు జిల్లా, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాలలో నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల జల్లుల పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

AP rain alert: Heavy rains in those districts; Polavaram, Dhavaleshwaram Godavari floods rising!!

రాష్ట్రంలో నేటినుంచి మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్న నేపథ్యంలో ముందస్తు సహాయక చర్యలకు అల్లూరి జిల్లాకు ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను, ఏలూరు కు రెండు ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలను తరలించినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

ఇదిలా ఉంటే ఏపీలో కురుస్తున్న వర్షాలతో పాటు, ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీటితో గోదావరి ఉదృతి అంతకంతకు పెరుగుతుంది. దీంతో పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. విపత్తుల నిర్వహణ సంస్థ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. వరద ముంపుకు గురయ్యే ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రయత్నాలు చేస్తుంది. కంట్రోల్ రూమ్ లను కూడా ఏర్పాటుచేసి పరిస్థితిని పర్యవేక్షిస్తుంది.

భారీ వర్షాల కారణంగా గోదావరి నది పరివాహక ప్రాంతమైన పోలవరం సబ్ డివిజన్ ఏజెన్సీ వేలేరుపాడు మండలంలో వరద ప్రభావిత పలు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.గోదావరి నదికి వరద ఉధృతి మరింత పెరుగుతుందని గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి భద్రాచలం వద్ద నీటిమట్టం 43.9 అడుగులకు చేరుకుందని పేర్కొంది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయగా, ప్రస్తుతంపోలవరం వద్ద 11.97మీటర్లకు నీటిమట్టం చేరుకుంది.

ఇక ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8.48 లక్షల క్యూసెక్కులుగా ఉందని పేర్కొన్నారు. ఈరోజు ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారిచేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+