ఏపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కు కరోనా పాజిటివ్

కరోనా వైరస్ రోజురోజుకు చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. సాధారణ ప్రజల నుండి ప్రజాప్రతినిధుల వరకు ఎవరిని వదలకుండా కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఏపీకి సంబంధించిన పలువురు ప్రజా ప్రతినిధులు ఇప్పటికే కరోనా బారినపడి ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ నాయకులను కరోనా వదలకుండా వేధిస్తోంది.

తాజాగా బిజెపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కరోనా బారిన పడ్డారు.తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అంతేకాదు ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, డాక్టర్ల సలహా మేరకు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నానని ట్వీట్ చేశారు సీఎం రమేష్. సీఎం రమేష్ ప్రస్తుతం ఆయన హైదరాబాద్ నివాసంలోనే హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఎవరూ తన గురించి ఆందోళన చెందవద్దని ఆయన పేర్కొన్నారు.

AP Rajya Sabha member CM Ramesh tests Corona positive

అయితే సీఎం రమేష్ ఆరోగ్యం గురించి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే బిజెపికి చెందిన పలువురు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. బీజేపీ నేత , మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే .కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్న పరిస్థితులు నిత్యం కనిపిస్తున్నాయి. ఈ కోవలోనే బిజెపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కూడా కరోనా బారిన పడ్డారు.

Recommended Video

    V Hanumantha Rao Slams TRS Govt డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నా ప్రభుత్వ భూములు అంటూ ఆక్రమణ !

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+