వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలోనే బ్లాక్ ఫంగస్ కేసుల్లో ఏపీ మూడో స్థానం : గుంటూరులోనే అధికంగా, ఏపీకి కొత్త భయం !!

|
Google Oneindia TeluguNews

కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం నుండి గట్టెక్కాము అనుకున్న చాలామంది కోవిడ్ బాధితులను ఇప్పుడు బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. కరోనా బారిన పడిన వారు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలని నిపుణులు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో బ్లాక్ ఫంగస్ గా పిలువబడే మ్యూకోర్ మైకోసిస్ కేసులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. ఇక తాజాగా గుంటూరు జిల్లాను బ్లాక్ ఫంగస్ కేసులు వణికిస్తున్నాయి.

కేరళలో కరోనా విజృంభణ ; థర్డ్ వేవ్ సంకేతం.. నిపుణుల బృందం నివేదికతో భారత్ లో కొత్త ఆందోళన !!కేరళలో కరోనా విజృంభణ ; థర్డ్ వేవ్ సంకేతం.. నిపుణుల బృందం నివేదికతో భారత్ లో కొత్త ఆందోళన !!

ఏపీలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు

ఏపీలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు

ఒకవైపు కరోనా మహమ్మారి కోరల్లో చిక్కి ఏపీ అల్లాడుతోంది. దేశంలో కేరళ, మహారాష్ట్ర తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కరోనా కట్టడి కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నిత్యం కరోనా కేసులు రెండు వేలకు పైచిలుకు నమోదవుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ ప్రజల్లో వణుకు పుట్టిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న చాలామందిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడుతున్నాయి. దీంతో వారు ఆసుపత్రులకు క్యూకడుతున్నారు.

గుంటూరు జిల్లా టాప్ లో .. బ్లాక్ ఫంగస్ కు అరాకొరా చికిత్స

గుంటూరు జిల్లా టాప్ లో .. బ్లాక్ ఫంగస్ కు అరాకొరా చికిత్స

గుంటూరు జిల్లాలో ఇప్పటికే వందల సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. అయితే బ్లాక్ ఫంగస్ బారిన పడిన బాధితులకు సరైన వైద్య సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్ కు వైద్యం చేస్తున్నామని ప్రభుత్వ యంత్రాంగం చెబుతోంది. అయితే క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. బ్లాక్ ఫంగస్ కు సరైన వైద్యం చేయకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగులకు మందులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ కేసులపై ప్రత్యేకమైన దృష్టి సారించాలని వారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

 దేశంలో ఏపీ బ్లాక్ ఫంగస్ కేసుల్లో మూడో స్థానంలో ఉందన్న కేంద్రం

దేశంలో ఏపీ బ్లాక్ ఫంగస్ కేసుల్లో మూడో స్థానంలో ఉందన్న కేంద్రం

జూలై 28 నాటికి, ఆంధ్రప్రదేశ్‌లో 4,209 మ్యూకోర్ మైకోసిస్ కేసులు నమోదయ్యాయని, మహారాష్ట్రలో 9,654 మరియు గుజరాత్‌లో 6,846 కేసులు నమోదయ్యాయని ఇటీవల లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడో స్థానంలో ఉందని తెలుస్తుంది. కోవిడ్ -19 ఇన్‌ఫెక్షన్ల విషయంలో ఏపీ టాప్ ఫైవ్ లో నే కొనసాగుతుంది . దేశవ్యాప్తంగా నివేదించబడిన బ్లాక్ ఫంగస్ కేసులలో ఎక్కువ భాగం మే నుండి కోవిడ్-19 బారిన పడిన వ్యక్తులే.

విపరీతంగా పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులతో ఆందోళన

విపరీతంగా పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులతో ఆందోళన

జూన్ 9 నాటికి, ప్రిన్సిపల్ సెక్రటరీ (ఆరోగ్యం, వైద్య మరియు కుటుంబ సంక్షేమ) అనిల్ కుమార్ సింఘాల్ చెప్పిన లెక్క ప్రకారం రాష్ట్రంలో 1,955 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయి. ఇది రెండు నెలల్లోపు రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం అనేక జిల్లాలలో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా గుంటూరు జిల్లాలోనే అధికంగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అవుతుండడం గమనార్హం. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులపై ప్రభుత్వం దృష్టి సారించి, వైద్య సదుపాయాలను మెరుగుపరచాలి అని, బ్లాక్ ఫంగస్ నివారణకు తగిన చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.

English summary
Black fungus cases continue to rise across the country. Andhra Pradesh ranks third in the country in cases of mucor mycosis known as black fungus. Recently, Guntur district has been plagued by black fungus cases. As on July 28, 4,209 cases of mucor mycosis were reported in Andhra Pradesh. The vast majority of reported black fungus cases nationwide are people who have been infected with Covid-19 since May.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X