పేరెన్స్ పేట్రియా: శ్రద్ధ చూపని కేంద్రం- సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కీలక పిటీషన్..!!
అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయి ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది. రోజులు గడిచిపోతున్నాయే తప్ప- ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన మెజారిటీ అంశాలు పరిష్కారానికి నోచుకోవట్లేదు. ఎక్కడి ఆస్తులు అక్కడే ఉన్నాయి. వాటి విలువ సుమారు లక్షన్నర కోట్ల రూపాయలు. ఈ విభజన సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా ఆసక్తి చూపట్లేదనేది స్పష్టమౌతోంది.

పేరెన్స్ పేట్రియా
ఈ వ్యవహారాన్ని తేల్చుకోవడానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో ఇవ్వాళ పిటీషన్‌ను దాఖలు చేసింది. పేరెన్స్ పేట్రియా కింద ఈ పిటీషన్ వేసింది. ఏపీ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ మహ్మఫూజ్ ఏ. నాజ్కీ ఈ పిటీషన్ వేశారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా ఆస్తుల పంపకాలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అభ్యర్థించారు.

రాజ్యాంగం ప్రకారం..
1,42,601 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తుల విభజన పూర్తి కావట్లేదని, ఉమ్మడి రాష్ట్రంలో మెజారిటీ ఆస్తులు హైదరాబాద్‌లోనే ఉన్నాయని ఏపీ ప్రభుత్వం తన పిటీషన్‌లో స్పష్టం చేసింది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిందని, సంవత్సరాలు గడుస్తోన్నప్పటికీ.. ఆస్తుల విభజన మాత్రం పూర్తికావట్లేదని వివరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 కింద రాష్ట్రానికి, ప్రజలకు ఉన్న హక్కులను పరిరక్షించుకోవడానికి పిటీషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది.

మెజారిటీ ఆస్తులు హైదరాబాద్‌లో..
తమ వాటాగా దక్కాల్సిన మెజారిటీ ఆస్తులన్నీ హైదరాబాద్‌లో ఉండిపోవడం, సకాలంలో పంపకాలు పూర్తికాకపోవడం వల్ల తాము నష్టపోవాల్సి వస్తోందని ఏపీ ప్రభుత్వం తన పిటీషన్‌లో స్పష్టంగా పేర్కొంది. పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో పొందుపరిచిన 91 ఇన్‌స్టిట్యూషన్స్, షెడ్యూల్ 10 కింద చేర్చిన 142 ఇతర సంస్థల్లో అధికభాగం హైదరాబాద్‌లోనే ఉన్నాయని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

ఉద్యోగుల ఇబ్బందులు..
సకాలంలో ఆయా సంస్థలు, ఇన్‌స్టిట్యూషన్స్ విభజన జరగకపోవడం వల్ల 2014 నుంచి వాటిల్లో పనిచేస్తోన్న ఉద్యోగులు నిస్సహాయస్థితిలో ఉంటోన్నారని పిటిషన్‌లో పేర్కొంది. విభజన తరువాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సరైన పింఛన్ కూడా అందట్లేదని ఏపీ ప్రభుత్వం వివరించింది. చాలా మందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు దూరం అయ్యారని తెలిపింది. ఆయా అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ ఆస్తులన్నింటినీ వీలైనంత త్వరగా విభజించాలని అభ్యర్థించింది ఏపీ ప్రభుత్వం.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications