AP Schools Reopening : జూన్ 12 నుంచి ఆన్ లైన్ లో- ఆగస్టు 16 నుంచి రెగ్యులర్ గా
ఏపీలో కరోనా పరిస్ధితుల నేపథ్యంలో విద్యాసంవత్సరం ప్రారంభం ఆలస్యమైంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కాస్త తగ్గడంతో పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. దీని ప్రకారం జూన్ 12 నుంచి ఆన్ లైన్ విధానంలో స్కూళ్లను పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీలో విద్యాసంవత్సరాన్ని జూన్ 12 నుంచి ఆన్ లైన్ ద్వారా ప్రారంభించాలని ప్రభుత్వం ఇవాళ నిర్ణయించింది. విద్యాశాఖపై సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ తరగతుల్ని ఆగస్టు 14 వరకూ కొనసాగిస్తారు. ఆగస్టు 15 వేడుకల తర్వాత ఆగస్టు 16 నుంచి రెగ్యులర్ స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. ఆగస్టులోపు విద్యాసంస్ధల్లో నాడు-నేడు పనులు పూర్తి చేసి స్కూళ్లు సిద్దం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం నేపథ్యంలో జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకూ వర్క్ బుక్స్ పై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు. దీంతో పాటు పాఠశాల్లో మిగిలిన ఏర్పాట్లు కూడా ఆగస్టు 15లోపు పూర్తి చేయాలని సీఎం జగనా్ ఆధేశాలు ఇచ్చారు. పాఠశాలల్లో నాణ్య మైన విద్య అందించడమే లక్ష్యంగా సీఎం చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రభుత్వం నూతన విద్యా విధానం తప్పనిసరిగా అమలు చేస్తుందని ఆయన సీఎంతో సమీక్ష అనంతరం వెల్లడించారు.
Recommended Video
నూతన విద్యా విధానం అమలు వల్ల ఏ స్కూల్ మూతపడదని, ఏ ఉపాద్యాయ పోస్టు కూడా తగ్గదని మంత్రి హామీ ఇచ్చారు. రాబోయే రెండేళ్లలో ఫౌండేషన్ స్కూళ్లకు అదనపు గదులు నిర్మాణం పూర్తవుతుందన్నారు. నాడు నేడు కింద పనుల కోసం 16 వేల కోట్లతో బడ్జెట్ సిద్దం చేయాలని సీఎం ఆదేశించాని మంత్రి సురేష్ తెలిపారు. 30శాతం పదోతరగతి , 70 శాతం ఇంటర్ ప్రధమ సంవత్సరం మార్కులు ప్రాతిపదికగా ఇంటర్ విద్యార్థులకు మార్కుల కేటాయిస్తామని విద్యాశాఖ మంత్రి సురేష్ తెలిపారు. ఈనెలాఖరు లోపు ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications