ప్రివిలేజ్ నోటీసుపై నిమ్మగడ్డ ఘాటు రిప్లై- మీకా అధికారం లేదు, ఇప్పుడు రాలేనంటూ
మంత్రి పెద్దిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ జారీ చేసిన నోటీసులకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీకి తనకు నోటీసులు జారీ చేసే అధికారం లేదని స్పష్టం చేశారు. అంతే కాదు ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నానని, ప్రయాణాలు చేయడం సాధ్యం కాదని కూడా తెలిపారు. దీంతో నిమ్మగడ్డ నుంచి వచ్చిన సమాధానాన్ని అసెంబ్లీ కార్యదర్శి ప్రివిలేజ్ కమిటీకి పంపనున్నారు. దీనిపై ప్రివిలేజ్ కమిటీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

ప్రివిలేజ్ కమిటీకి నిమ్మగడ్డ ఘాటు రిప్లై
మంత్రి పెద్దిరెడ్డిపై తాను చేశానని చెబుతున్న అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ తనకు జారీ చేసిన నోటీసులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఎట్టకేలకు స్పందించారు. అసెంబ్లీ కార్యదర్శి ద్వారా ప్రివిలేజ్ కమిటీ జారీ చేసిన నోటీసులపై స్పందించిన నిమ్మగడ్డ... అదే స్ధాయిలో సమాధానం కూడా ఇచ్చారు. దీంతో ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీకి నిమ్మగడ్డ ఇచ్చిన సమాధానం కూడా చర్చనీయాంశమవుతోంది. తన సమాధానంలో నిమ్మగడ్డ.. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ అధికారాల్ని కూడా ప్రశ్నించారు.

మీకా అధికారం లేదన్న నిమ్మగడ్డ
తనకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ జారీ చేసిన నోటీసులపై స్పందించిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్... తనకు నోటీసులు జారీ చేసే పరిది ప్రివిలేజ్ కమిటీకి లేదన్నారు. తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపాలని ఆయన ప్రివిలేజ్ కమిటీని డిమాండ్ చేశారు. అదే సమయంలో శాసనసభ్యులపై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. అసెంబ్లీపై కూడా తనకు పూర్తి గౌరవం ఉందన్నారు. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ తన పరిధిలోని ఎస్ఈసీపై నోటీసు జారీ చేసిందని నిమ్మగడ్డ చెప్పినట్లయింది. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ అధికారాలపై నిమ్మగడ్డ వేసిన ప్రశ్నకు ఇప్పుడు కమిటీ ఎలా స్పందిస్తుందన్న అంశం కూడా ఉత్కంఠగా మారింది.

వ్యాక్సిన్ వేయించుకున్నా.. రాలేను
అసెంబ్లీ కార్యదర్శికి పంపిన సమాధానంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మరో అంశాన్ని కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం తాను కరోనా వ్యాక్సిన్ తీసుకున్నానని, ప్రయాణాలు చేసే పరిస్ధితి లేదని ప్రివిలేజ్ కమిటీకి తెలిపారు. అయినా అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందుకెళ్లాలని భావిస్తే... సరైన సమయంలో తాను స్పందిస్తానని జవాబులో నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఇందుకు ఆధారాలు తనకు సమర్పించడంతో పాటు తగిన సమయం కూడా ఇవ్వాలని ప్రివిలేజ్ కమిటీని ఆయన కోరారు.

నిమ్మగడ్డ సమాధానంతో డిఫెన్స్‌లో ప్రభుత్వం
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించకుండా సెలవులో వెళ్తున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను అడ్డుకునే లక్ష్యంతో ఆయనకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీతో నోటీసులు ఇప్పించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆయన సమాధానంతో డిఫెన్స్‌లో పడింది. బలవంతంగా నిమ్మగడ్డను రప్పించలేక, అలాగని ఎన్నికలపై నిర్ణయాన్ని వాయిదా వేసుకోలేక ప్రభుత్వం సతమతం అవుతోంది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. మరో పది రోజుల్లో ఎలాగో నిమ్మగడ్డ రమేష్ పదవీకాలం ముగిసిపోతోంది. కాబట్టి తదుపరి ఎస్ఈసీ నియామకం జరిగే వరకూ పరిషత్ పోరుపై వేచి చూడాల్సిన పరిస్ధితి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications