ఏపీలో పంచాయతీ ఎన్నికలు..! ఎస్ఈసీ కీలక ఆదేశాలు..!

ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కీలకమైన స్ధానిక సంస్ధల ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్ని సజావుగా నిర్వహించేందుకు వీలుగా ఎన్నికల జాబితాల తయారీకి ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికారులు ఈ ప్రక్రియపై నిమగ్నమవుతున్నారు. అలాగే ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపైనా క్లారిటీ వస్తోంది.

గ్రామపంచాయితీ ఎన్నికల కోసం ఓటర్ జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. గ్రామ పంచాయతీల సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం, రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన వార్డు వారీ ఫోటో ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 01.01.2026ను అర్హత తేదీగా తీసుకుని అసెంబ్లీ ఓటరు జాబితాలను ఆధారంగా చేసుకుని ఈ జాబితాలు తయారు చేయాలని ఆదేశించింది.

AP SEC orders to prepare voter lists for gram panchayat elections-here are full details

ఇలా తయారు చేసిన ఓటరు జాబితాలను మార్చి 9న అధికారికంగా ప్రచురించబోతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ దృష్ట్యా ఈ ప్రక్రియ చేపట్టబడుతున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.ఈ లెక్కన మార్చి 9న ఓటరు జాబితాల్ని ప్రచురిస్తే..ఆ తర్వాత ఏ క్షణంలో అయినా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వానికి అవకాశం లభిస్తుంది. నియోజకవర్గాల పునర్ విభజన, జనాభా గణనతో వీటికి ఎలాగో సంబంధం లేదు కాబట్టి ఈ ఏడాదిలోనే ఈ ఎన్నికల నిర్వహించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+