ఏముందని అమరావతికి వెళ్లాలి?: ప్రభుత్వ ఒత్తిడిని తప్పుపట్టిన ఉద్యోగులు
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి సచివాలయ ఉద్యోగుల తరలింపు అంశం మళ్లీ మొదటికొచ్చింది. 'జూన్ 27వ తేదీ నుంచి ఉద్యోగుల తరలింపు' అంటూ ప్రభుత్వం ముహూర్తం నిర్ణయించినా ఉద్యోగులు మాత్రం 'మరో ఆరు నెలలు ఆగండి సార్' అంటూ గడువు కోరుతున్నారు.
గురువారం సచివాలయ ఉద్యోగుల సంఘం నిర్వహించిన సర్వసభ్య సమావేశం రభసగా మారింది. సౌకర్యాలు లేని అమరావతికి ఇప్పట్లో వెళ్లలేమని... జూన్‌లో వెళ్లే నిర్ణయాన్ని మార్చుకుని, మార్చికి వాయిదా వేయాలని పలువురు ఉద్యోగులు సూచించారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సమీపంలో అద్దెలకు ఇళ్లు దొరికే పరిస్థితి లేదని, ఎటువంటి మౌలిక వసతులూ లేని ఆ ప్రాంతానికి ఎలా వెళ్లాలని ఉద్యోగ సంఘం నేతలపై ఉద్యోగులు ప్రశ్నలు కురిపించారు. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం నిర్మాణాలు పూర్తికాకుండానే రోజుకో మాట చెబుతూ ఉద్యోగులను మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
జూన్ 30లోగా అమరావతికి వెళ్లడం సాధ్యం కాదని చెప్పిన ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ, సౌకర్యాలన్నీ కల్పించిన తరువాత మాత్రమే తరలింపు ప్రారంభించాలని, వచ్చే సంవత్సరం మార్చి వరకూ తరలింపు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. నిర్మాణాలు పూర్తయ్యాకే వెళ్లేలా ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని, ఆ మేరకు ప్రభుత్వంతో చర్చించాలని ఉద్యోగుల సంఘం నాయకుడు మురళీకృష్ణను డిమాండ్ చేశారు.

ఏముందని అమరావతికి వెళ్లాలి?: ప్రభుత్వ ఒత్తిడిని తప్పుపట్టిన ఉద్యోగులు
జూన్‌లో వెళ్లడానికి 80 శాతం మంది ఉద్యోగులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారంటూ పలువురు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. కొంత మంది ఉద్యోగులు మాత్రం వెంటనే కొత్త రాజధాని వెళ్లేందుకు సంసిద్ధత ప్రకటించగా ఎక్కుమంది మరో ఆర్నెల్లు ఆగితే అన్నీ రకాలుగా సిద్ధమవుతామని చెబుతున్నారు. ‘‘కార్పొరేట్ సంస్థల్లో టెన్త, ఇంటర్ తరగతులు ప్రారంభమై సగానికి పైగా సిలబస్ పూర్తవుతోంది. ఇప్పుడు పిల్లలను అక్కడికి ఎలా తీసుకెళ్లాలి? ఎక్కడ చేర్చాలి?'' అని ప్రశ్నించారు.

ఏముందని అమరావతికి వెళ్లాలి?: ప్రభుత్వ ఒత్తిడిని తప్పుపట్టిన ఉద్యోగులు
అలాగే...ఎవరు, ఎప్పుడు, ఏ దశలో వెళ్లాలన్నది స్పష్టం చేయకపోవడంతో అందరిలో అయోమయం నెలకొంది. పిల్లల విద్య, ఉద్యోగులకు వసతి, రవాణా ఖర్చులు, స్థానికత వంటి అంశాలపై కూడా ఇంత వరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఎంసెట్ ఫలితాలు వచ్చాయి. అడ్మిషన్లు ప్రారంభమవుతాయి. ఇక్కడున్న పిల్లలు అక్కడకు పోతే స్థానికత లేకపోవడంవల్ల 10 శాతం సీట్లు మాత్రమే పొందుతారు. మెడిసిన అడ్మిషన్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతికి వెళ్లేదెలా?'' అని ప్రశ్నించారు.

ఏముందని అమరావతికి వెళ్లాలి?: ప్రభుత్వ ఒత్తిడిని తప్పుపట్టిన ఉద్యోగులు
అక్టోబర్‌లో ప్రారంభించి వచ్చే జూన్ నాటికి తరలింపు ప్రక్రియ పూర్తిచేస్తే బాగుంటుందని మరికొందరు సూచించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. సచివాలయంలో ఆయా అంశాలపై తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నాని మురళీకృష్ణ చెప్పగా అందరి అభిప్రాయాలను తీసుకోవాలని కొంత మంది సభ్యులు స్పష్టంచేశారు. తమ అభిప్రాయాలను నేరుగా ముఖ్యమంత్రికి కూడా వివరించాలని వారు సమావేశంలో డిమాండ్ చేశారు. తరలింపుపై ఒక రోడ్ మ్యాప్ ప్రకటించాలని పలువురు కోరారు.

ఏముందని అమరావతికి వెళ్లాలి?: ప్రభుత్వ ఒత్తిడిని తప్పుపట్టిన ఉద్యోగులు
సచివాలయ ఉద్యోగుల తరలింపును వచ్చే సంవత్సరానికి వాయిదా వేయాలని ఏపీ సచివాలయ ఉద్యోగుల హౌసింగ్ సోసైటీ మాజీ అధ్యక్షులు కె. వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. తరలింపునకు ఉద్యోగులు మానసికంగా సిద్ధపడకపోవడమే కాకుండా ఈ అంశంపై ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. ప్రభుత్వం రోజుకో తేదీ చెబుతూ గందరగోళం సృష్టిస్తోందన్నారు. జూన్ 27న తరలిస్తామని ఉత్తర్వులు ఇవ్వాలని అడిగితే భవన నిర్మాణం పూర్తవుతుందనే నమ్మకం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణకు కుదిరాక ఇస్తారనడం బాధ్యతా రాహిత్యం అన్నారు.

ఏముందని అమరావతికి వెళ్లాలి?: ప్రభుత్వ ఒత్తిడిని తప్పుపట్టిన ఉద్యోగులు
జూన్ 30 నాటికి తాము అమరావతికి వెళ్లడం ఖాయమన్న మురళీకృష్ణ ఉద్యోగుల తీవ్ర ఒత్తిడితో మళ్లీ ఒకసారి సీఎంను కలుద్దామని అన్నారు. ‘‘ఈ నెల 16 లేదా 17న నేరుగా ముఖ్యమంత్రితోనే చర్చించాలని నిర్ణయించుకున్నాం. అన్ని కోణాల్లో చర్చిస్తాం. ఈ భేటీలో ఎవరు ఎప్పుడు వెళ్లాలనే స్పష్టత వస్తుంది. ఆ తర్వాత రెండు రోజుల్లో తరలింపు మార్గదర్శకాలు విడుదల అవుతాయి'' అని తెలిపారు. ‘‘మొత్తం ఉద్యోగుల్లో 20 శాతమే విజయవాడకు కుటుంబ సమేతంగా వెళ్తారు. మిగిలిన వారు కుటుంబ సభ్యులను హైదరాబాద్‌లోనే ఉంచి, తాము మాత్రమే వెళ్లే అవకాశముంది'' అని తెలిపారు.












Click it and Unblock the Notifications