రాజధానిలోనే తాత్కాలిక సచివాలయం: 180కోట్లతో 10 అంతస్తుల్లో నిర్మాణం?
అమరావతి: నవ్యాంధ్రప్రదేశ్‌లో తాత్కాలిక సచివాలయాన్ని రాజధాని అమరావతి పరిధిలోనే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రూ.180 కోట్లను వెచ్చిస్తోంది. ఇది తాత్కాలిక వసతైనప్పటికీ రాజధాని పరిధిలోనే నిర్మిస్తే భవిష్యత్తు అవసరాలకు పనికొస్తుందన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రాజధాని పరిధిలోని ఐదు ప్రాంతాల నుంచి మట్టి నమూనాలను సేకరించి, శనివారం పరీక్షలు ప్రారంభించారు. ఏ ప్రాంతాన్ని ఎంపిక చేశారనేదానిపై ఐదారు రోజుల్లో స్పష్టత వస్తుందని సమాచారం.

తాత్కాలిక సచివాలయం ఆంగ్లాక్షరం ‘సి' ఆకారంలో, ఎనిమిది లేదా పది అంతస్తులుగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరు లక్షల చదరపు అడుగుల భవనాన్ని నిర్మిస్తే అన్ని విధాలుగా బాగుంటుందని సీఆర్‌డీఏ అధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది.
కాగా, ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు జి+2 లేదా జి+3 వరకు సత్వరం నిర్మిస్తారు. తర్వాత మిగతా అంతస్తులను కడతారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా ఏర్పడిన నాటి నుంచి ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌లోనే ఏపి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications