తల, మొండం వేరు: క్షుద్రపూజకు బలైన చిన్నారి ఇతనే (ఫోటోలు)
అమరావతి: మూఢనమ్మకం ఉన్మాదంగా మారి ఓ ఐదేళ్ల చిన్నారిని బలితీసుకుంది. ప్రకాశం జిల్లాలోని వలేటివారిపాలెం మండలం పోకూరు ఎస్సీ కాలనీలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన పెద్ద కలకలం సృష్టించింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
పోకూరు గ్రామానికి చెందిన పెయ్యల తిరుమలరావుకు పెళ్లయిన రెండో రోజే భార్య వదిలి వెళ్లిపోయింది. అప్పటినుంచి ఆయన ఇంట్లోనే ఏవో పూజలు చేసుకుంటున్నాడు. ఎస్సీ కాలనీకి చెందిన లింగాబత్తిన మనుసాగర్ (5) అనే చిన్నారి ఎప్పటిలాగే బుధవారం కూడా అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లాడు. అక్కడ ఆడుకుంటున్న మనుసాగర్‌ను తిరుమలరావు తనవెంట తీసుకెళ్లాడు.
ఇంట్లోకి వెళ్లిన తర్వాత తిరుమల రావు.. పూజలు చేస్తున్న గదిలో మనుసాగర్‌ను వేటకొడవలితో నరికి తల, మొండెం వేరు చేశాడు. ఆ తర్వాత వాటిని దేవుని ముందు పెట్టి క్షుద్ర పూజలు చేశాడు. రోజూ మధ్యాహ్నం కల్లా అంగన్‌వాడీ స్కూలునుంచి వచ్చే చిన్నారి ఇంటికి రాకపోవటంతో అంగన్‌వాడీ కేంద్రంలో చదువుకుంటున్న మనుసాగర్ మధ్యాహ్న భోజనానికి ఇంటికి రాకపోవడంతో తల్లి పాఠశాలకు వెళ్లి విచారించింది.
బాలుడ్ని తిరుమలరావు తీసుకుని వెళ్లినట్లు ఉపాధ్యాయులు ఆమెకు చెప్పారు. ఆమె తిరుమలరావు ఇంటిముందునుంచి వెళుతుండగా అక్కడ చిన్నారి చెప్పులు కనిపించాయి. దీంతో ఇంట్లోకి వెళ్లి చూసిన తల్లిదండ్రులకు.. తల, మొండెం వేరుపడిన బిడ్డ కనిపించటంతో గుండెలు పగిలేలా రోదించారు.

ప్రకాశంలో నరబలి: బాలుడి తల, మొండెం వేరు చేసి క్షుద్రపూజలు
క్షుద్రపూజల కోసం చిన్నారిని బలి ఇచ్చిన తిరుమలరావుని గ్రామస్తులు పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని శ్మశానంలోకి లాక్కెళ్లి పెట్రోలు పోసి తగులబెట్టేందుకు ప్రయత్నించారు.

ప్రకాశంలో నరబలి: బాలుడి తల, మొండెం వేరు చేసి క్షుద్రపూజలు
ఈ విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న కందుకూరు డీఎస్పీ వి. శ్రీనివాసరావు, సీఐ లక్ష్మణ్, ఎస్‌ఐ హజరత్తయ్యలు అక్కడికి చేరుకుని గ్రామస్తులకు సర్దిచెప్పి ఉన్మాదిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రకాశంలో నరబలి: బాలుడి తల, మొండెం వేరు చేసి క్షుద్రపూజలు
తర్వాత క్షుద్ర పూజలు జరిగిన ఇంటిని, బాలుడి మృతదేహాన్ని పరిశీలించారు. భార్య వదిలివెళ్లటంతో.. పిచ్చోడిలా మారిన తిరుమలరావు మతి సరిగాలేక ఏవో పూజలు చేసుకుంటున్నాడని భావించామని గ్రామస్తులు తెలిపారు. ఇంత దారుణానికి ఒడిగడతాడని ఊహించలేదన్నారు.

ప్రకాశంలో నరబలి: బాలుడి తల, మొండెం వేరు చేసి క్షుద్రపూజలు
క్షుద్ర పూజల కోసం బాలుడిని నరబలి ఇచ్చారన్న వార్త తెలియటంతో.. పోకూరు చుట్టుపక్కల గ్రామాల్లోనూ కలకలం రేపింది. క్షుద్ర పూజలు జరిగిన ఇంటిని, బాలుడి మృతదేహాన్ని ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ పరిశీలించారు. మనుసాగర్ తల్లిదండ్రులను ఓదార్చారు. కందుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications