ఏపీలో రూ.81 వేల కోట్లతో పరిశ్రమలు- SIPB గ్రీన్ సిగ్నల్- ఆర్ధికముఖ చిత్రం మారిపోతుందన్న జగన్
సీఎం జగన్ అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర పారిశ్రామిక ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్రంలో
గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.81వేల కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితోపాటు మరిన్ని పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. గ్రీన్ ఎనర్జీలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలుస్తుందని సీఎం జగన్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని, భారీ సంఖ్యలో ఉద్యోగాలు, రైతులకు మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవాళ జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో కాసిస్ ఇ-మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.386.23 కోట్ల పెట్టుబడితో వైయస్సార్‌జిల్లా కొప్పర్తిలో పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇందులో ఎలక్ట్రిక్ బస్సుల తయారీకోసం రూ.286.23 కోట్లు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకోసం రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. తొలివిడతలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వేయి ఎలక్ట్రిక్ బస్సులు తయారుచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
దీని ద్వారా 1200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

అలాగే లైఫిజ్ ఫార్మా రూ.1900 కోట్లతో కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దీంతో 2వేలమందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. ఏప్రిల్ 2024నాటికి కంపెనీ ఏర్పాటు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఏపీఐ డ్రగ్ తయారీలో చైనా దిగుమతులపై ఆధారపడకుండా.. స్వయం సమృద్ధి సాధించేదిశగా దీన్నిఏర్పాటు చేస్తున్నారు.ఈ పరిశ్రమ కోసం ఇప్పటికే 236.37 ఎకరాలను కంపెనీ సేకరించింది. మరోవైపు మూడు విడతల్లో రూ.43,143 కోట్లు పెట్టుబడితో మెటలార్జికల్‌గ్రేడ్ సిలికాన్, పాలీ సిలికాన్, ఫ్లోట్, రోల్డ్ గ్లాసెస్ తయారీకోసం పరిశ్రమతోపాటు సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్ధ ఏర్పాటు చేయనుంది. .
దీంతో 11,500 మందికి ప్రత్యక్షంగా, 11 వేలమందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి. నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద 5,147 ఎకరాల్లో తయారీ పరిశ్రమ, దీంతోపాటు 50 గిగావాట్లు, 10 గిగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ నెలకొల్పనుంది.
కృష్ణా జిల్లా మల్లవల్లిలో రూ.150 కోట్ల పెట్టుబడితో అవిశా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ మెగా ఫుడ్‌పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. దీంతో 2500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. 2023 మార్చి కల్లా దీన్ని పూర్తిచేస్తారు.
దీనికోసం 11.64 ఎకరాల భూమి కేటాయించారు. దీంతో పాటు ఆరు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకూ ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ ఆరు ప్రాజెక్టులకోసం రూ.81,043 కోట్ల పెట్టుబడి పెడతారు. తద్వారా 20,130 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన జరుగుతుంది.
వైయస్సార్ జిల్లా వొంగిమల్ల వద్ద రూ.8,240 కోట్ల పెట్టుబడితో 1800 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టును అస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. దీంతో ప్రత్యక్షంగా 4వేలమందికి ఉద్యోగాలు వస్తాయి. 1,390 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు ఏర్పాటవుతుంది. డిసెంబర్ 2029 నాటికి దీన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యం.
అలాగే సోమశిల, ఎర్రవరం వద్ద రెండు పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. సోమశిల వద్ద 900 మెగావాట్లు, ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. 2100 మెగావాట్ల ప్రాజెక్టుకోసం రూషిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ 8,855 కోట్లు ఖర్చు చేయనుంది. దీంతో 1600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. జులై 2029 నాటికి దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

అవుకు, శింగనమల వద్ద రూ.6,315 కోట్ల పెట్టుబడితో అరబిందో రియాల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఏర్పాటు చేసే రెండు పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టుకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. దీంతో 1600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అవుకు వద్ద 800 మెగావాట్లు, సింగనమల వద్ద 800 మెగావాట్ల విద్యుత్‌ఉత్పత్తి ప్రాజెక్టులు చేపడతారు. డిసెంబర్ 2028 నాటికి ఈ రెండు ప్రాజెక్టులు పూర్తిచేయాలని లక్ష్యం. వైయస్సార్‌జిల్లా పైడిపాలెం వద్ద ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధ పంప్డ్ హైడ్రో, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. 7,200 మెగావాట్ల కరెంటు ఉత్పత్తికోసం ఇది రూ.33,033కోట్లు ఖర్చు చేయనుంది.
పైడిపాలెం ఈస్ట్ 1200 మెగావాట్లు, నార్త్ 1000 మెగావాట్లు, 3500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, 1500 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తారు. 7,200 మందికి ప్రత్యక్షంగా ఉపాధిలభించే ఈ ప్రాజెక్టు డిసెంబర్ 2028 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టుకు కూడా ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.అలాగే కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను ఏఎం గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది.
రూ. 5వేల కోట్ల పెట్టుబడితో నిర్మించే ఈ ప్రాజెక్టులకు కూడా ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. వేయి మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. 700 మెగావాట్ల సోలార్, 300 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులను ఈ కంపెనీ ఏర్పాటు చేయనుంది. మార్చి 2025 నాటికి ప్రాజెక్టుల పూర్తిచేయాలని లక్ష్యం.
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పంప్డ్, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను గ్రీన్‌కో ఏర్పాటు చేయనుంది. 1680 మెగావాట్ల పంప్డ్‌స్టోరేజీ ప్రాజెక్టు, 2300 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేస్తారు.
ఇందుకు రూ.19,600 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. 4,230 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించే ఈ పరిశ్రమ
సెప్టెంబర్ 2026 నాటికి పూర్తిచేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయన్నారు. ప్రాజెక్టుల్లో భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని, ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోందన్నారు. క్లీన్ ఎనర్జీలో దేశానికి ఆదర్శంగా నిలుస్తామన్నారు. రైతులకు పెద్దగా ఆదాయాలు రాని భూముల్లో ఏడాదికి ఎకరాకు రూ.30వేల వరకూ లీజు కింద డబ్బు వస్తుందన్నారు. దీనివల్ల వారికి ఆదాయాలు కూడా పెరుగుతాయన్నారు. పరిశ్రమల ఏర్పాటు, వాటి నిర్వహణ తదితర వాటికోసం పెద్ద ఎత్తున సంస్థలు ప్రవేశిస్తాయన్నారు. వాటిద్వారా నైపుణ్యాభివృద్ధి జరుగుతుందన్నారు.
-
జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ పై ప్రభుత్వం కీలక నిర్ణయం...!! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్












Click it and Unblock the Notifications