అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్ కు గోల్డెన్ ఛాన్స్ - ప్రత్యేక హోదాపై నీతీ ఆయోగ్ కీలక వ్యాఖ్యలు : ఏపీకి దక్కాలంటే..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వరా. పార్లమెంట్ లో ఇచ్చిన హామీ అమలు కాదా. ఇది ఏడున్నారేళ్ల కాలంగా ఏపీ నుంచి కేంద్రాన్ని ఎదురవుతున్న ప్రశ్న. కానీ, కేంద్రం మాత్రం హోదా ముగిసిన అధ్యాయం అని చెబుతూ వస్తోంది. అసలు 14వ ఆర్దిక సంఘం సిఫార్సుల మేరకు ఏ రాష్ట్రానికి హోదా అనేది ఇవ్వటం లేదనేది తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని ఏపీలోనూ బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. ఇక, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారు. రాజకీయంగా విమర్శలు రావటంతో దాని పైన చంద్రబాబు వెనుకడుగు వేసారు.

నాడు హోదా అంశంతో చంద్రబాబు ఇరకాటం

నాడు హోదా అంశంతో చంద్రబాబు ఇరకాటం

ఇక, జగన్ తన పార్టీకి చెందిన 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తానని హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఏపీలో 22 మంది ఎంపీలు గెలుపొందారు. కానీ, ముఖ్యమంత్రి జగన్ తన ఢిల్లీ పర్యటనలోనే హోదా పైన తేల్చి చెప్పేసారు. కేంద్రానికి పూర్తి మెజార్టీ ఉందని..తమ పైన ఆధారపడే ప్రభుత్వం కాకపోవటంతో..హోదా పైన అడుగుతూనే ఉంటామని స్పష్టం చేసారు. ఇక, తాజాగా తిరుపతిలో జరిగిన దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశంలోనూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను సీఎం జగన్ ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు.

2019 ఎన్నికల ముందు జగన్ ప్రధానాస్త్రంగా

2019 ఎన్నికల ముందు జగన్ ప్రధానాస్త్రంగా

అదే విధంగా రెండు రోజుల క్రితం వైసీపీ ఎంపీలు పార్లమెంట్ కేంద్రంగా ప్రత్యేక హోదా ఎందుకు ఏపీకి ఇవ్వరంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. అయితే, ఇప్పటి వరకు 14వ ఆర్దిక సంఘం ఎవరికీ హోదా ఇవ్వద్దని సిఫార్సు చేసిందని కేంద్రం చెబుతుండగా... అసలు అలాంటి సిఫార్సు ఆర్దిక సంఘం నుంచి రాలేదని గతంలోనే జగన్ చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పడ్డ నీతి అయోగ్ రాష్ట్రాలకు నిధులు.. కేటాయింపుల విషయంలో కీలక పాత్ర పోషిస్తోంది. నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ ప్రత్యేక హోదా పైన కీలక వ్యాఖ్యలు చేసారు.

రాజీవ్ కుమార్ ప్రత్యేక హోదా వ్యాఖ్యలు

రాజీవ్ కుమార్ ప్రత్యేక హోదా వ్యాఖ్యలు


బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ను నిశితంగా పరిశీలిస్తామని, ఆ రాష్ట్రానికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందజేస్తామని రాజీవ్ కుమార్ చెప్పారు. గడచిన దశాబ్దంలో బిహార్ వివిధ రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిందని, అయితే గతంలో పునాదులు బలహీనంగా ఉండటం వల్ల ఇతర రాష్ట్రాలను అందుకోవడానికి మరికొంత సమయం పట్టవచ్చునని అన్నారు. రాజీవ్ కుమార్ ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ, బిహార్‌కు సాధ్యమైనంత ఎక్కువగా సహాయపడేందుకు, సహకరించేందుకు నీతీ ఆయోగ్ సిద్ధంగా ఉందని చెప్పారు.

బీహార్ కు ఇచ్చే అంశం నిశితంగా పరిశీలనలో

బీహార్ కు ఇచ్చే అంశం నిశితంగా పరిశీలనలో

అయితే ప్రత్యేక హోదాకు సంబంధించినంత వరకు ఆ రాష్ట్రం చెప్తున్న వివరణను నిశితంగా పరిశీలిస్తామని, తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ అంశాన్ని త్వరలోనే పరిశీలిస్తామన్నారు. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ 15 ఏళ్ళ నుంచి ఉంది. నీతీ ఆయోగ్ తాజా నివేదిక నేపథ్యంలో ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ మరోసారి ఈ డిమాండ్‌ను లేవనెత్తారు. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా కూడా రాజ్యసభ కార్యకలాపాలను నిలిపివేయాలని, బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంపై చర్చించాలని ఓ నోటీసు ఇచ్చారు.

ఏపీకి ఇవ్వాలంటూ నినదిస్తారా....నిలదీస్తారా

ఏపీకి ఇవ్వాలంటూ నినదిస్తారా....నిలదీస్తారా


అయితే, ఏపీతో పాటుగా జార్ఖండ్..ఒడిశా..సైతం ప్రత్యేక హోదా పైన కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ప్రత్యేక హోదాపై రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు జగన్ కు గోల్డెన్ ఛాన్స్ లా మారాయి. బీహార్ కు అమలు చేసే అంశం పైన నీతి అయోగ్ సానుకూలత వ్యక్తం చేయటంతో..ఏపీ గురించి డిమాండ్ చేసే అవకాశం దక్కుతోంది. ఇదే సమయంలో జగన్ వేచి చూసే ధోరణితో ఉంటే..ప్రతిపక్షాలు దీనినే అవకాశంగా మలచుకొనే ఛాన్స్ ఉంది. పార్లమెంట్ లో నాడు ప్రధాని ఇచ్చిన హామీ అమలు కోసం ఇప్పుడు నీతి అయోగ్ తో పాటుగా కేంద్రం పైన ఒత్తిడి చేసేందుకు ఒక మార్గం సుగమం అయింది.

జగన్ దీనిని అవకాశంగా మలచుకుంటారా

జగన్ దీనిని అవకాశంగా మలచుకుంటారా

కొద్ది రోజుల క్రితమే నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ ఏపీలో పర్యటించారు. ఏపీలో అమలు చేస్తున్న విధానాలను అభినందించారు. ముఖ్యమంత్రి జగన్ తోనూ సమావేశమయ్యారు. ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్.. నీతి అయోగ్ ప్రత్యేక హోదా అంశంలో స్పందించిన తీరు..బీహార్ విషయంలో చేసిన వ్యాఖ్యలతో... ఏపీ అంశం పైన ఏ రకంగా ఒత్తిడి పెంచుతారు.. కేంద్రం పైనా ఎటువంటి వైఖరితో ముందుకెళ్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. హోదా అంశంతోనే నాడు జగన్ ముఖ్యమంత్రి గా చంద్రబాబు పైన ఒత్తిడి చేసి..కేంద్రం నుంచి టీడీపీ బయటకు రావటం - బీజేపీకి టీడీపీని దూరం చేయటంలో అస్త్రంగా ప్రయోగించారు. అందులో సక్సెస్ అయ్యారు. ఇక, ఇప్పుడు అదే హోదా అంశం తాజాగా రాజీవ్ కుమార్ వ్యాఖ్యలతో మరోసారి ఏపీలో రాజకీయంగా కీలక సమీకరణాలను నాందిగా మారే అవకాశం కనిపిస్తోంది.

English summary
s now a Golden chance for Jagan govt to demand for AP special status as Niti Aayog vice Chairman Rajiv Kumar said that the centre will consider the demand for Bihar special status.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X