జగన్ తీపి కబురు వింటావ్!: టిడిపి ఎమ్మెల్యే లేఖ, హోదా ఫైట్: బాబు ఫోన్ నెంబర్ ఇదే..
హైదరాబాద్: బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీపి కబురు అందుతుందని గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షులు, వినుకొండ ఎమ్మెల్యే జివిఎస్ ఆంజనేయులు బుధవారం చెప్పారు.
ఈ మేరకు ఆయన బుధవారం వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ప్రత్యేక హోదా పైన రూట్ మ్యాప్ తయారు చేయాలని ప్రధాన మంత్రి నీతి అయోగ్‌ను ఆదేశించారన్నారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పాల్గొని, హోదాపై కసరత్తు చేశారన్నారు.
ప్రత్యేక హోదా విషయంలో వైసిపి అధినేత జగన్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి వేరుగా మండిపడ్డారు. సీఎం చంద్రబాబును విమర్శిస్తూ, ప్రధాని మోడీని సమర్థించే వైఖరి అవలంభిస్తున్నారని ఆరోపించారు. బుధవారం ప్రత్యేక హోదా ఉద్యమం కోసం ఎస్సెమ్మెస్ యుద్ధంను రఘువీరా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

వైయస్ జగన్
బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీపి కబురు అందుతుందని గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షులు, వినుకొండ ఎమ్మెల్యే జివిఎస్ ఆంజనేయులు బుధవారం చెప్పారు.

ఎస్సెమ్మెస్ వాల్ పోస్టర్
ప్రత్యేక హోదా ఉద్యమం ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీయేనని, కాబట్టి సాధించేదీ తామే కావాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు రఘువీరా రెడ్డి ఉద్బోద చేశారు.

వెంకయ్య ఫోన్ నెంబర్
పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకు రావాలన్నారు. ఇందుకోసం అక్టోబర్ 2న రాజమండ్రిలో నిర్వహించే రీలే నిరాహార దక్షలో పెద్ద ఎత్తున కేడర్ పాల్గొనాలని రఘువీరా కోరారు.

చంద్రబాబు ఫోన్ నెంబర్
ఏయూ క్యాంపస్‌లో ప్రత్యేక హోదాపై ఎస్ఎంఎస్ ఉద్యమ పోస్టర్‌ను ఆవిష్కరించిన రఘువీరా రెడ్డి.. కేంద్రమంత్రులకు హోదా కోరుతూ కోటి ఎస్సెమ్మెస్‌లు పంపాలని పిలుపునిచ్చారు.

అశోక్ గజపతి రాజు ఫోన్ నెంబర్
ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అశోక గజపతి రాజు, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరిల ఫోన్ నెంబర్లు ప్రకటించారు. వాటికి ఎస్సెమ్మెస్‌లు పంపించాలన్నారు.

నిర్మలా సీతారామన్ ఫోన్ నెంబర్
వియ్ డిమాండ్ ఇమ్మీడియేట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అంటూ మెసేజ్ పంపించాలని రఘువీరా సూచించారు.

సుజనా చౌదరి ఫోన్ నెంబర్
ఏయూ క్యాంపస్‌లో ప్రత్యేక హోదాపై ఎస్ఎంఎస్ ఉద్యమ పోస్టర్‌ను ఆవిష్కరించిన రఘువీరా రెడ్డి.. కేంద్రమంత్రులకు, ముఖ్యమంత్రికి హోదా కోరుతూ కోటి ఎస్సెమ్మెస్‌లు పంపాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications