ఏపీలో టెన్త్ క్లాస్ పేపర్ల లీకేజీ కలకలం-లేదు లేదంటూనే అరెస్టులు-అయినా ఆగని వైనం
ఏపీలో వరుసగా రెండేళ్ల కరోనా సమస్యల తర్వాత ఈ ఏడాది జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో లీకేజీల బెడద వెంటాడుతోంది. రెండు రోజుల క్రితం పరీక్షలు మొదలు కాగా.. ఇందులో తొలిరోజే తెలుగు పరీక్షా పత్రం లీకేజీల ఆరోపణలు వచ్చాయి. రెండో రోజు హిందీ పరీక్షా పత్రం కూడా అక్కడక్కడా లీకైనట్లు ఆరోపణలు వచ్చాయి. వాట్సాప్ లో ప్రశ్నాపత్రాలు మెసేజ్ ల తరహాలో సులువుగా షేర్ అయిపోతున్నా ప్రభుత్వం మాత్రం వీటిని మాల్ ప్రాక్టీస్ కోణంలోనే చూస్తోంది. దీంతో వరుసగా టీచర్ల అరెస్టులు సాగుతున్నా ఈ లీకేజీలకు అడ్డుకట్ట పడటం లేదు.

టెన్త్ పేపర్ల లీకేజీల పర్వం
ఏపీలో రెండు రోజుల క్రితం ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్లో లీకేజీల పర్వం సాగుతోంది. తొలి రోజు తెలుగు పరీక్షా పత్రం రాయలసీమ జిల్లాల్లో లీక్ అయినట్లు వార్తలొచ్చాయి. వాట్సాప్ గ్రూపుల్లో ఈ పరీక్షా పత్రం కనిపించడంతో విద్యార్ధులు,వారి తల్లితండ్రులు ఆందోళనలకు గురయ్యారు. అయితే స్పందించిన ప్రభుత్వం ఇది పరీక్ష ప్రారంభమైన తర్వాత లీక్ అయిందని, ఇది లీక్ కిందకు రాదని, మాల్ ప్రాక్టీస్ మాత్రమేనని వివరణ ఇచ్చింది. అయితే రెండు రోజు హిందీ పరీక్షా పత్రం కూడా లీక్ కావడంతో ఈ అనుమానాలు మరింత పెరిగాయి.

టీచర్ల వరుస అరెస్టులు
ఓవైపు పదో తరగతి పరీక్షలు సాఫీగానే జరుగుతున్నట్లు వివరణలు ఇస్తున్న ప్రభుత్వం మరోవైపు టీచర్లను అరెస్టులు చేస్తూనే ఉంది. తొలిరోజు తెలుగు పరీక్షా పత్రం బయటికి రావడానికి, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ కావడానికి కారకుడంటూ నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ గిరిధర్ రెడ్డిని అరెస్టు చేసిన ప్రభుత్వం.. ఆయనకు సహకరించిన మరికొందరు టీచర్లను కూడా అరెస్టు చేసింది. రెండో రోజు హిందీ పరీక్షా పత్రం విషయంలోనూ శ్రీకాకుళంతో పాటు పలు జిల్లాల్లో టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓవైపు లీకేజీలు లేవంటూనే మరోవైపు మాల్ ప్రాక్టీస్ కు కారణమయ్యారంటూ వీరిని ప్రభుత్వం అరెస్టులు చేస్తోంది. అయినా లీకేజీలు ఆగడం లేదు.

పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్ల నిషేధం
వరుస లీకేజీల ఆరోపణల నేపథ్యంలో పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లను తీసుకెళ్లటాన్ని నిషేధిస్తూ.. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షా కేంద్రం ప్రాంగణం వెలుపలే డిపాజిట్ చేసుకోవాలని సూచిస్తూ.. ఆ శాఖ కమిషనర్ సురేష్ కుమార్ సర్క్యులర్ ఇచ్చారు. పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్ధులు, ఎగ్జామినర్లు ఎవరూ.. మొబైల్ ఫోన్లు తీసుకెళ్లొద్దని కమిషనర్ స్పష్టం చేశారు. మరోవైపు.. పరీక్షల విధులతో సంబంధం లేని సిబ్బందిని ఎట్టిపరిస్థితుల్లోనూ కేంద్రాలకు అనుమతించొద్దని డీఈవోలను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విద్యార్ధుల్లో ఆందోళన
పదో తరగతి పరీక్షల్లో లీకేజీల పర్వం ఇప్పుడు సక్రమంగా పరీక్షలు రాస్తున్న విద్యార్ధుల్ని కలవరపెడుతోంది. ఇప్పటికే రెండు పరీక్షా పత్రాలు లీక్ అయినట్లు ఆరోపణలు రావడం, ప్రభుత్వం టీచర్లను వరుసగా అరెస్టులు చేస్తుండటంతో ఈ లీకేజీలపై విద్యార్ధుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. తల్లితండ్రులు కూడా తమ పిల్లలు బాగా చదివి పరీక్షలు రాస్తుంటే ప్రభుత్వం లీకేజీలకు అడ్డుకట్ట వేయలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన పరీక్షల్లో అయినా లీకేజీలకు అడ్డుకట్ట వేయాలని వారు కోరుతున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications