AP SSC Exams Schedule 2023 : పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల-పూర్తి వివరాలివే..
ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదో తరగతి చదువుతున్న విద్యార్ధులు.. వచ్చే ఏడాది రాసే పరీక్షల కోసం ప్రభుత్వం ఇవాళ షెడ్యూల్ ప్రకటించింది. దీని ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ లో పదో తరగతి పరీక్షలు నిర్వహించబోతున్నారు.
ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పదో తరగతి పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్ 3 నుంచి 18 వరకూ జరగబోతున్నాయి. ఇందులో ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 6న సెకండ్ లాంగ్వేజ్, ఏప్రిల్ 8న ఇంగ్లీష్, ఏప్రిల్ 10న గణితం, ఏప్రిల్ 13న సైన్స్, ఏప్రిల్ 15న సోషల్ స్టడీస్ పరీక్షలు జరగబోతున్నాయి. అలాగే ఏప్రిల్ 17న కాంపోజిట్ కోర్సు, ఏప్రిల్ 18న ఒకేషనల్ పరీక్ష ఉంటుందని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్షలు ఉంటాయి.

ఈసారి కూడా పదో తరగతి పబ్లిక్ పరీక్షల్ని కరోనా నిబంధనల మేరకు నిర్వహించే అవకాశముంది. అసలే దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు యథావిథిగా కరోనా నిబంధనలు అమలు చేస్తారని తెలుస్తోంది. అదే సమయంలో కరోనా మరింత విజృంభిస్తే మాత్రం అప్పటి పరిస్దితుల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. దీంతో ప్రస్తుతానికి షెడ్యూల్ మాత్రమే ప్రకటించారు. వచ్చే ఏడాది ఆరంభంలో పరిస్ధితుల ఆధారంగా పరీక్షలకు ఏర్పాట్లు చేసే అవకాశముంది.












Click it and Unblock the Notifications