ఏపీలో నైట్ కర్ఫ్యూ పై మందుబాబుల టెన్షన్ ... శుభవార్త చెప్పిన ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందుబాబులు డిసెంబర్ 31, జనవరి ఒకటవ తేదీలలో మద్యం షాపులు ఉంటాయా లేదా అన్న విషయంపై తెగ టెన్షన్ పడ్డారు. మామూలు సమయాల్లో డిసెంబర్ 31, జనవరి ఒకటవ తేదీలలో మద్యం షాపులకు అదనపు సమయాన్ని కేటాయిస్తారు. ఇక బార్ అండ్ రెస్టారెంట్ ల విషయమైతే చెప్పాల్సిన అవసరమే లేదు. నూతన సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి దాటేంత వరకు తెరిచే ఉంటాయి. అయితే ఈ ఏడాది అదనపు సమయం మాట అటుంచి, అసలు వైన్ షాప్స్, బార్ అండ్ రెస్టారెంట్ లు ఉంటాయా లేదా అన్న దానిపై మందుబాబులు తెగ ఆందోళన పడ్డారు .

నైట్ కర్ఫ్యూ విధించి , లిక్కర్ షాపులు క్లోజ్ చేస్తారని మందుబాబుల ఆందోళన
ఏకంగా ఎక్సైజ్ కార్యాలయానికి కాల్ చేసి మద్యం షాపుల గురించి అడిగి వివరాలు తెలుసుకుంటున్నారట.
కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది అనేక ప్రాంతాలలో నైట్ కర్ఫ్యూ విధించారు. డిసెంబర్ 31వ తేదీన , జనవరి ఒకటవ తేదీన పూర్తిగా కర్ఫ్యూ విధించి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను బ్యాన్ చేశారు. కొత్త రకం కరోనా వైరస్, అలాగే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏపీలో కూడా ఇదేవిధంగా కర్ఫ్యూ విధిస్తారేమో అని ఆందోళన చెందారు మందుబాబులు .

ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు విపరీతంగా ఫోన్ కాల్స్ .. ప్రకటన విడుదల చేసిన ఏపీఎస్బీసిఎల్
ఇదే విషయంపై ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు కాల్ చేసి మద్యం షాపుల టైమింగ్స్ అడుగుతున్నారని సమాచారం.ఈ క్రమంలో విపరీతంగా వస్తున్న ఫోన్ కాల్స్ తో ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏపీలో నైట్ టైం కర్ఫ్యూ ఏమీ లేదని, మద్యం షాపులు ఎప్పుడూ ఉన్నట్టే ఉదయం 11 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటాయని, అలాగే బార్ అండ్ రెస్టారెంట్ లు కూడా ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయని ప్రకటించారు.

యధావిదిగా లిక్కర్ షాపులు , బార్ అండ్ రెస్టారెంట్ ల టైమింగ్.. మందుబాబులకు గుడ్ న్యూస్
అదనపు సమయం ఇవ్వలేదని స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయం విన్న మందుబాబులు అదనపు సమయం కేటాయించనప్పటికీ లిక్కర్ షాపులు తెరిచి ఉంటాయని ప్రకటించడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
ఇప్పటికే కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా మహారాష్ట్ర , కర్ణాటక వంటి రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూ విధించారు. కర్ణాటక యూ టర్న్ తీసుకుని నైట్ కర్ఫ్యూ ఉపసంహరించుకుంది . ఇక ఏపీ, తెలంగాణాలలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లేవని ప్రకటించారు . అయినప్పట్టికీ లిక్కర్ షాపులు ఉంటే చాలని మందుబాబులు కోరుకున్నట్టే , గుడ్ న్యూస్ చెప్పారు.