గౌతమ్ రెడ్డి మరణంతో విషాదం- జగన్ విధేయుడుగా : మేకపాటి వారసుడిగా..!!
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం అందరికీ షాకింగ్ న్యూస్ గా మారింది. చిన్న వయసులోనే అటు వ్యాపార రంగంలో..ఇటు రాజకీయంగానూ సక్సెస్ అయ్యారు. గౌతమ్‌రెడ్డికి ఈ ఉదయం తీవ్ర గుండె పోటు వచ్చింది. వంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ ఈ ఉదయం 8.45 గంటలకు కన్నుమూశారు. ఆయన వయస్సు 49 ఏళ్లు.. ఆయన 1971 నవంబర్ 2న జన్మించారు. ఆయన నాలుగు రోజుల విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వెళ్లారు. వారం రోజుల పాటు దుబాయ్ ఎక్స్‌పోకు హాజరయ్యారు. ఈ ఉదయం మరణించారు.
Recommended Video

మేకపాటి వారసుడిగా
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణ పల్లిలో గౌతమ్ రెడ్డి జన్మించారు. యూకేలోని మాంచస్టర్ గా టెక్స్ టైల్స్ లో ఎమ్మెస్సీ పూర్తి చేసారు. ఆయనక భార్య శ్రీకీర్తి.. కుమార్తె అనన్య రెడ్డి..కుమారుడు అర్జున్ రెడ్డి ఉన్నారు. మంత్రిగా ఉంటూనే కేఎంసీ సంస్థ ఎండీగా పని వ్యవహరిస్తున్నారు. తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి పారిశ్రామిక వేత్తగా..ఎంపీగా పని చేసారు. జగన్ కాంగ్రెస్ పార్టీ వీడి సొంతంగా పార్టీ పెట్టిన సమయంలో పార్టీ నుంచి జగన్ తో పాటుగా లోక్ సభకు ఎంపికయ్యారు. 2014 ఎన్నికల్లో గౌతమ్ రెడ్డి తొలి సారిగా రాజకీయంగా ఎంట్రీ ఇచ్చారు.

తొలి నుంచి జగన్ తోనే
ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆత్మకూరు ఎమ్మెల్యేగా 30,191 ఓట్లతో గెలుపొందారు. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఉదయగిరి, ఒంగోలు, నరసరావుపేట, నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. మేకపాటి కుటుంబానికి జిల్లాలో రాజకీయంగా మంచిపట్టు ఉంది. వైఎస్సార్‌సీపీ తరఫున మళ్లీ ఆత్మకూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. 2019 ఎన్నికల్లో రెండో సారి ఆత్మకూరు నుంచి గెలిచిన గౌతమ్ రెడ్డికి సీఎం జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా అవకాశం దక్కింది. ఐటీ... పరిశ్రమల శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అనేక పారిశ్రామిక సదస్సుల్లో ఆయన పాల్గొన్నారు.

మంత్రిగా ..పారిశ్రామిక వేత్తగా
జగన్ కు అత్యంత సన్నిహితుడుగా కొనసాగుతున్నారు. మంత్రిగా బిజీగా ఉంటున్నా..ఆయన నిత్యం జిమ్ చేస్తారు. ఒక ట్రయినర్ సమక్షంలోనే ఆయన నిత్యం జిమ్ చేస్తూ ఉంటారు. గతంలో రెండు సార్లు కరోనా బారిన పడ్డారు. దుబాయ్ లో జరిగిన ఏపీ ఎక్స్ పో లో మంత్రి వారం పాటు పాల్గొన్నారు. ఆదివారమే తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ ఉదయం ఒక్క సారిగా గుండె పోటుతో ఆయన కుప్ప కూలారు. వెంటనే చికిత్స కోసం అపోలోకు తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే...గౌతమ్ రెడ్డి తుది శ్వాస విడిచారు.

రెండో సారి ఎమ్మెల్యే.. మంత్రిగా
మంత్రిగా ఉంటూ.. 49 ఏళ్ల వయసులోనే గౌతమ్ రెడ్డి మరణించటంతో ఒక్క సారిగా సీఎం జగన్ తో పాటుగా సహచర మంత్రులు..వైసీపీ నేతలు విషాదంలో మునిగిపోయారు. నేటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసారు. నేతలు హైదరాబాద్ తరలి వెళ్తున్నారు. నెల్లూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో హైదరాబాద్ కు తరలి వస్తున్నారు. సహచర మంత్రులతోనూ నిత్యం ఫిట్ నెస్ గురించి చర్చించే గౌతమ్ రెడ్డి ఇప్పుడు హఠాన్మరణం చెందటాన్ని మంత్రులు జీర్ణించుకోలేక పోతున్నారు.












Click it and Unblock the Notifications