Free Bus: ఉచిత బస్సుపై షాకింగ్ రిపోర్ట్..! సీఎం కీలక ఆదేశాలు..!
ఏపీలో కూటమి సర్కార్ సూపర్ సిక్స్ ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు (free bus) పథకాన్ని గతేడాది ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. ఇప్పుడు రోజుకు 20 లక్షల మందికి పైగా మహిళలు ఈ ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం కూడా అదనపు బస్సులు కేటాయించాల్సిన పరిస్ధితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఉచిత బస్సుపై అధ్యయనం చేయించింది. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ అధ్యయనంలో ఓ షాకింగ్ విషయం బయటపడింది.
ప్రకాశం జిల్లా పోలీసులు తాజాగా ఉచిత బస్సు పథకం అమలు తర్వాత మారిన పరిస్ధితులపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా ఉన్నతాధికారులతో వర్చువల్‌గా ఇవాళ ఓ సమీక్ష నిర్వహించారు. ఇందులో వారు ఉచిత బస్సు పథకం కారణంగా తమ జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు వివరాలు అందజేశారు. దీంతో సీఎం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇవాళ ప్రకాశం జిల్లా పోలీసులు ప్రభుత్వానికి ఉచిత బస్సు పథకంపై అందించిన రిపోర్టులో ఈ పథకం అమలుకు ముందుతో పోలిస్తే 19 శాతం రోడ్డు ప్రమాద మరణాలు తగ్గినట్లు వెల్లడించారు. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లోనూ ఇలాంటి అధ్యయనం చేయించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో అధికారులు ఇతర జిల్లాల్లోనూ ఉచిత బస్సు కారణంగా రోడ్డు ప్రమాదాలపై పడిన ప్రభావం ఎలా ఉందో అధ్యయనం చేసేందుకు సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications