175 సీట్లు గెలుస్తారా ? నమ్మకం ఉంటే ఎన్నికలకు రండి-జగన్ సర్కార్ కు అచ్చెన్న సవాల్
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న వార్ తో ముందస్తు ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. దీంతో ప్రత్యర్ధులపై పైచేయి సాధించేందుకు మాటలతో పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా టీడీపీ తమకు 160 సీట్లు ఖాయమంటుంటే వైసీపీ ఏకంగా 175కు 175 సీట్లు గెలుస్తామని ఊదరగొడుతోంది.దీనిపై ఇవాళ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు
175 సీట్లు గెలుస్తాననే నమ్మకంవుంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ నాయకులకు ఇవాళ సవాల్ విసిరారు. 2 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకొని దాదాపు పది మంది విద్యార్థుల ప్రాణాలు తీసుకున్న దుర్మార్గులు వైసీపీ నాయకులని ఆయన విమర్శించారు. దీనిపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 10వ తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో జూమ్ కాల్స్ నిర్వహిస్తుంటే వైసీపీ నాయకులు ఆటంకాలు సృష్టించారన్నారు.

వైసీపీ పార్టీ ఫేక్ పార్టీ. టెన్త్ కాస్ల్ పాస్ కాని సన్నాసి కొడాలి నానికి టెన్త్ క్లాస్ విద్యార్థుల జూమ్ మీటింగ్ లో ఏం పని అని అచ్చెన్న ప్రశ్నించారు. కార్యక్రమాన్ని ఎగతాళి చేశారని, ఫేక్ ఐడీలతో ఎంతోమంది జీవితాలతో ఆడుకుంటారని ఆయన నిలదీశారు. విద్యార్థులకు ధైర్యాన్ని ఇవ్వాలని లోకేశ్ జూమ్ మీటింగ్ నిర్వహిస్తే ఈ రకంగా భంగం కలిగించడం ఎంతవరకు సమంజసమన్నారు. దీనిపై సంబంధిత అధికారులు విచారించి చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ మూడు సంవత్సరాల్లో వైసీపీ నాయకులు ప్రజలను దగా చేశారని, ఒక్క సారి అధికారం ఇవ్వండి అని అధికారంలోకి వచ్చారని, అన్ని రంగాలను నాశనం చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం, ఒంగోలులో జరిగిన మహానాడును చూసి జగన్ కల్లుతాగిన కోతిలా మారి పిచ్చి ప్రేలాపనలు పేలుస్తున్నారని అచ్చెన్న విమర్శించారు. వైసీపీ పార్టీ నిర్వహించిన వర్క్ షాప్ లో జగన్ అనేక పిచ్చి ప్రేలాపనలు పేలారని, ప్రజలకు అదిచేస్తాం, ఇది చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఈ మూడు సంవత్సరాల్లో అన్ని రంగాలను నాశనం చేశారని అచ్చెన్న ఆరోపించారు. అనేక విధ్వంసాలు సృష్టించారని, రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారన్నారు.
వైసీపీ నాయకులు కల్లుతాగిన కోతుల్లా మారి పిచ్చి ప్రేలాపనలు పేలుస్తున్నారని, మళ్లీ ఎన్నికలు జరిగితే 175 స్థానాలు గెలుస్తానని చెప్పడం విడ్డూరంగా వుందన్నారు. 175 సీట్లు గెలుస్తాననే నమ్మకంవుంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. 30 ఏళ్లు మాదే పాలన అని డాంభికాలు పలికిన జగన్, ఎమ్మెల్యేలకు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూసి ఓటమి భయం పట్టుకుందన్నారు. వ్యవస్థల్ని వాడుకొని, పోలీసులను నీ ఆధీనంలోకి తెచ్చుకొని ఇతర పార్టీలపై దాడులు చేసి గెలవాడినికి నీ ఆధ్వర్యంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు, మండల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు కాదన్నారు. ఈ మూడు సంవత్సరాల్లో ప్రజలకు ఏం ఉపకారం చేశారో చెప్పాలన్నారు. జగన్ రాజకీయాలకు అనర్హుడని అచ్చెన్న వ్యాఖ్యానించారు. ఒకసారి ప్రజలు వైసీపీకి ఓట్లు వేసి నష్టానికి గురయ్యారని, ఏ రంగంలో ఏం సాధించారో చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications