నిరూపిస్తే పీక కోసుకుంటా - అచ్చెన్న సవాల్..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ పైన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో అటు సీఐడీ పలు కీలక అంశాలను ప్రస్తావించింది. కేసులో చోటు చేసుకున్న పరిణామాలు.. విచారణ తీరును వివరించింది. అదే సమయంలో మాజీ మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడు ప్రమేయాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా టీడీపీ నిరసలకు దిగుతోంది. ఈ సమయంలో అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు.

టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్ట్ పైన పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న స్పందించారు. రాజకీయ కక్ష్యలతో ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడమే సీఎం జగన్ పనిగా మారిందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను జైలులో పెట్టి ఆనందపడుతున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా తన అకౌంట్ లోకి కానీ,తన కుటుంబ సభ్యులకు కానీ..అదే విధంగా తమ నాయకుడు చంద్రబాబు, వారి కుటుంబ సభ్యుల అకౌంట్లలోకి ఒక్క పైసా అక్రమంగా వచ్చినట్టు నిరూపిస్తే పీక కోసుకుంటానని అచ్చెన్న సవాల్ చేసారు.

AP TDP President Achamnaidu slams YSRCP Govt and CID on Chandra Babu arrest

చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఇరికింది అక్రమంగా అరెస్ట్ చేసారని అచ్చెన్న ఆరోపించారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. ఒక్క రోజు అయినా చంద్రబాబును జైల్లో ఉంచాలనేది జగన్ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. పరిపాలనపై అవగాహన ఉన్న ఎవరికైనా కేబినెట్ లో ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు. మంత్రివర్గ సమావేశంలో అధికారులు.. మేధావులు..ప్రభుత్వంలో సీనియర్ అధికారులు ఉంటారని గుర్తు చేసారు. వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా మోసం చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. తప్పుడు కేసులు పెడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+