ఇంకో రౌండ్: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ఛాన్స్

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తోన్నాయి. ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. చెరువులు, వాగులు, వంకలు తొణికిసలాడుతోన్నాయి. వరదనీటితో పోటెత్తుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టుల గేట్లను ఎత్తేశారు. వరద నీటిని దిగువకు వదిలి వేస్తోన్నారు. ఇదే పరిస్థితి ఇంకొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు.

వచ్చే 48 గంటల్లో కొన్ని చోట్ల అతిభారీ వర్షాలు పడొచ్చని అంచనా వేస్తోన్నారు. ఉపరితల ఆవర్తనం కారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఉత్తరం బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం ఉపరితలంపై 4.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నట్లు చెప్పారు.

AP Telangana on high alert as IMD warns of rains today also

క్రమంగా ఇది నైరుతి దిశకు కదులుతున్నట్లు గుర్తించారు. క్రమంగా ఇది బలహీనపడుతుందని చెప్పారు. గురువారం తరువాత వర్షాలు తగ్గుముఖం పడుతాయని అంచనా వేస్తోన్నారు. ఇప్పుడున్న అల్పపీడనం ప్రభావం వల్ల మంగళ, బుధ వారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో చెదురుమదురుగా వర్షాలు పడతాయని, గురువారం నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టొచ్చని పేర్కొన్నారు. సోమవారం ఏపీలో అతి భారీ వర్షాలు కురిశాయి. కాకినాడ-187, పెదపూడి-187, కాకినాడ పోర్ట్-183, జెఎన్టీయూ కాకినాడ-168, ముంచంగిపుట్టు-155 మిల్లీమీటర్ల మేర వర్షం పడింది.

కవిటి-121, రామచంద్రాపురం-98, నర్సీపట్నం-97, గోలుగొండ-88, మారేడుమిల్లి-86, చోడవరం-86, ఇచ్ఛాపురం-83, పాడేరు బ్రిడ్జ్-81 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇదే పరిస్థితి మంగళ, బుధవారాల్లో ఉండొచ్చని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఆ తరువాత క్రమంగా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోన్నారు. మరోవంక- ఇప్పటికే కురిసిన భారీ వర్షాల వల్ల ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. జలకళను సంతరించుకున్నాయి. కడపజిల్లాలోని గండికోట ప్రాజెక్టు పూర్తిగా నిండింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+